సింగరేణి ప్రైవేటీకరణపై బీఆరెస్ సిద్ధమా

సింగరేణి ప్రైవేటీకరణపై బీఆరెస్ సిద్ధమా

సవాల్ విసిరిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సింగరేణిలో ప్రయివేటికరణకు ఆజ్యం పోసిన కేసీఆర్ సర్కార్ బీజేపీ ప్రభుత్వంపై నిందారోపణలు చేస్తూ మహాధర్నాలకు పిలుపునివ్వడం శోచనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ,  బీఆరెస్ ప్రభుత్వం ప్రైవేటీకరణ జపాన్ని పాటిస్తూ కేంద్రంలోని బిజెపిపై నిందలు మోపడం విడ్డురంగా ఉందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఒకె విధానాన్ని కేంద్ర ప్రభుత్వం  పాటిస్తుందని గుర్తు చేశారు.  

సింగరేణి సంస్థలో ప్రైవేటు వ్యక్తులకు అండగా నిలుస్తోంది కేసీఆర్ ప్రభుత్వం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఒరిస్సాలో టెండర్ల ద్వారా అక్కడి ప్రభుత్వం బొగ్గు బ్లాకులను  వశం చేసుకోగా సింగరేణి ఎందుకు టెండర్లలో  పాల్గొనలేదని ఆయన నిలదీశారు . సింగరేణి  విషయంలో బీఆర్ఎస్ నేతలు బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. మరోసారి తెలంగాణలో బీఆరెస్ అధికారంలోకి వస్తే సింగరేణి వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అవుతుందని ఆయన ఆరోపించారు.