ఇబ్రహీంపట్నం ఎన్నికల ప్రచారంలో ఉద్రక్తత.. 

ఇబ్రహీంపట్నం ఎన్నికల ప్రచారంలో ఉద్రక్తత.. 
  • ఘర్షణకు దిగిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

ఇబ్రహీంపట్నం, ముద్ర: సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నడంతో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో ఆదివారం  బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు ప్రచారంలో ఎదురుపడడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. మున్సిపల్ కేంద్రంలోని ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ప్రచారంలో ఎదురుపడ్డారు. దీంతో పరస్పరం మాటల యుద్దానికి దిగారు. మాటా మాటా పెరిగి ఇరువర్గాలు తోసుకున్నారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. ఓటమి భయంతో బీఆర్ఎస్ నేతకు తమ ప్రచారానికి అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిసస్తుండగా.. శాంతియుతంగా ప్రచారం చేస్తుంటే రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.