హోరా హోరిగా ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

హోరా హోరిగా ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

తగ్గేది లేదు అంటున్న బిఆర్ఎస్ శ్రేణులు గెలుపు మాదే నంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

ముద్ర ప్రతినిధి ఎల్లారెడ్డిపేట ఎన్నికల సమయం రోజురోజుకు దగ్గరకు వస్తున్న సమయంలో బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల శ్రేణులు జోరుగా ప్రచారం చేస్తూ గెలుపు మాదే నంటే మాదే అంటూ ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు 24 గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తూ స్థానిక మంత్రి కేటీఆర్ ను కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓవైపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు 6 గ్యారంటీ పథకాల కరపత్రాలు ప్రజల ముందుకు తీసుకెళ్తామని అన్ని వర్గాల ప్రజలకు పథకాలను తప్పకుండా అందేలా చేస్తామని చేయి గుర్తుకు ఓటు వేసి కేకే మహేందర్ రెడ్డి ని అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని, ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావాలి ప్రజలతో అన్నారు.రెండు పార్టీల ప్రచారం జోరుని చూస్తుంటే ఓటర్లకు ఎటు ఓటు వేయాలో తలలు ప్యాంటుకుంటున్నారు.

ఒకవైపు బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కొంతమంది ప్రజలు సద్వినియోగం చేసుకుని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్టా ఏర్పాటు అవస్యకతను గుర్తించి తెలంగాణ ను ఇచ్చిన సోనియా గాంధీకి ప్రతిఫలంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాష్టం లో కాంగ్రెస్ ప్రభుత్యం ఏర్పడేలా ఓటువేసి అశ్విర్వధించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లను ఓటు అభ్యర్థిస్తున్నారు . ఈ ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీల సీనియర్ నాయకులు,కార్యకర్తలు ప్రచార కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.