ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిరంతర పోరాటం

ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిరంతర పోరాటం
  • బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి 
  • ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం 

ఇబ్రహీంపట్నం, ముద్ర ప్రతినిధి: రాష్ట్ర సాధనలో పోరాట స్ఫూర్తితో ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిరంతర పోరాటం చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001 ఏప్రిల్ 27వ తేదీన స్వరాష్ట్ర సాధన కోసం పుట్టి తెలంగాణను సాధించి, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పార్టీ అహర్నిశలు చేసిందని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది రైతులు, శ్రామికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు, వారి అభివృద్ధి కోసం పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లోనూ పార్టీ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటుందని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రతిపక్ష హోదాను సమర్థవంతంగా నిర్వహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎస్వీ రమణారెడ్డి, ఎంపీపీ కృపేష్, జడ్పీటీసీ జంగమ్మ యాదయ్య, కౌన్సిలర్ ఆకుల యాదగిరి, నాయకులు కిషన్ గౌడ్, చీరాల రమేష్, కొప్పు జంగయ్య, బుగ్గరాములు, బద్రి గుప్త, తదితరులు పాల్గొన్నారు.