నిరుపేదలకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం

నిరుపేదలకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం

భూదాన్ పోచంపల్లి ,ముద్ర;నిరుపేద కుటుంబాలకు బిఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని భువనగిరి నియోజకవర్గం శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దేశ్ముకి గ్రామస్తులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి హైదరాబాదులోని సాయి సంజీవని ఆసుపత్రిలో గాయపడ్డ బాధితులను పరామర్శించారు .అనంతరం డాక్టర్లను గాయాలపాలైన వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించారు .వీరితోపాటు ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, జెడ్పిటిసి కోట పుష్పలత మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్ యాదవ్, దేశ్ముకి గ్రామ సర్పంచ్ దుర్గం స్వప్న నరేష్, ఎంపిటిసి చిల్లర జంగయ్య తదితరులు పాల్గొన్నారు.