కాంగ్రెస్ లోకి బీఆరెస్ కీలక నేతలు

కాంగ్రెస్ లోకి బీఆరెస్ కీలక నేతలు
  • దండెపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ తో పాటు సర్పంచ్ లు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు జరిగాయి. బీఆరెస్ కు చెందిన ప్రజాప్రతినిధులు, బీఆరెస్ నేతలు మంగళవారం హైదరాబాద్ లో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దండెపల్లి మండల పరిషత్ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మాజీ ఎంపిపి ముత్యాల శంకరయ్య, చింతపల్లి, తానిమాడుగు సర్పంచ్ లు అక్కల దేవక్క, పెంద్రం ప్రేమల, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు, వార్డు సభ్యులు, మంచిర్యాల, లక్షేట్టిపేట మండలాలకు చెందిన పార్టీ నేతలు కాంగ్రెస్ తీర్థం స్వీకరించారు.  ప్రేమ్ సాగర్ రావు వారికి పార్టీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో అభిమానం పెరుగుతోందన్నారు. ఇటీవల బీఆరెస్ నేతలు కాంగ్రెస్ లో చేరడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. మంచిర్యాల బీఆరెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు, మైనార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా బీఆరెస్ లో అసంతృప్తి తో ఉన్నవారు కాంగ్రెస్ లో చేరడానికి సంప్రదిస్తున్నారని తెలిపారు. పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు. దండెపల్లి ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రేమ్ సాగర్ రావు పై నమ్మకం, విశ్వాసంతో కాంగ్రెస్ లో చేరినట్లు చెప్పారు. కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని అన్నారు.