బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు సైనికుల్లా పని చేయాలి: ఎమ్మెల్యే కూసుకుంట్ల

బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు సైనికుల్లా పని చేయాలి: ఎమ్మెల్యే కూసుకుంట్ల

ముద్ర ప్రతినిధి, నల్లగొండ:రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరు సైనికుల పని చేయాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. బుధవారం నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి పరోక్షంగానో, ప్రత్యక్షంగానో చేరాయని అన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. అమలు చెయ్యలేని 6 గ్యారంటీల కాంగ్రెస్ ను గంగలో కలపాలన్నారు. సీఎం అభ్యర్థులు లేని బిజెపి కాంగ్రెస్లను ప్రజలు నమ్మొద్దని మూడోసారి బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చి మరింత అభివృద్ధికి బాటలు వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.