ప్రభుత్వ నిర్ణయాలతో తీరని అన్యాయం

ప్రభుత్వ నిర్ణయాలతో తీరని అన్యాయం
  • జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మెన్ ఎస్వీ రమణారెడ్డి
  • నల్గొండ సభకు తరలిన బీఆర్ఎస్ శ్రేణులు

ముద్ర ప్రతినిధి, ఇబ్రహీంపట్నం: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మెన్ సత్తు వెంకటరమణారెడ్డి విమర్శించారు. కృష్ణా జలాల పరిరక్షణ కోసం నల్లగొండలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో మంగళవారం నిర్వహించిన చలో నల్లగొండ బహిరంగ సభకు ఇబ్రహీంపట్నం నుండి బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా తరలివెళ్ళారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా జలాలపై పోరాడాల్సిన కాంగ్రెస్‌ నాయకులు తమపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకి కేంద్రంతో లోపాయికారి ఒప్పందం ఉందని, వాళ్ల చేతగానితనం వల్లే కృష్ణా జలాలపై హక్కుని కోల్పోయామన్నారు. కృష్ణా జలాల వివాదం వస్తే మేడిగడ్డ పోయి ఏం చేస్తారని ప్రశ్నించారు. సీఎం, మంత్రులు నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ను ఎందుకు సందర్శించడం లేదని అన్నారు. ప్రజలంతా నీటి కోసం మరోసారి పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. మంచాల మండల బీఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు చీరాల రమేష్ , ప్రధాన కార్యదర్శి బహదూర్ ల అధ్వర్యంలో మంచాల మండల పార్టీ కార్యకర్తలు సభకు తరలివెళ్లారు.