ఖమ్మం నుంచే బిఆర్ఎస్ శంఖారావం

ఖమ్మం నుంచే బిఆర్ఎస్ శంఖారావం

ఖమ్మంలో బుధవారం జరిగే భారాస తొలి ఆవిర్భావ సభకు ఖమ్మం నగరం శివారు వివి పాలెం కొత్త కలెక్టరేట్ వద్ద ప్రత్యేక వేదిక సిద్ధమైంది. వరుస క్రమంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, నేతల కటౌట్లు ఆకట్టు కుంటున్నాయి. నగరవ్యాప్తంగా సుమారు రూ.2 కోట్ల వరకు హోర్డింగులు, కటౌట్లకు వెచ్చించినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సభా వేదికకు ఎదురుగా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రులు కేసీ ఆర్, కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయ న్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సిపిఐ నేత రాజా కటౌట్లు ఆకర్షిస్తున్నాయి. ముఖ్యమం త్రుల పర్యటనలో ఇబ్బందులు తలెత్తకుండా పోలీ సుశాఖ సుమారు 5వేల మంది తో పటిష్ఠ బందోబస్తు కల్పిస్తోంది. ఖమ్మం -వైరా మధ్యలో ఉన్న సభా ప్రాంగణానికి వెళ్లే వాహనాలు మాత్రమే అనుమతిస్తామని సిపి విష్ణువారియర్ తెలిపారు. ఇతర వాహనాలను బైపాస్ మార్గం ద్వారా రాకపోకలు సాగించాలని సూచించారు.

 ఆఖరిలో కేసీఆర్ ప్రసంగం: 

యాదాద్రి దేవాలయం దర్శన అనంతరం నలుగురు ముఖ్యమంత్రులు రెండు ప్రత్యేక హెలికాప్టర్లో ఖమ్మం కలెక్టరేట్ వద్దకు రానున్నారు. అది ప్రారంభo అనంతరం అక్కడే భోజనం చేయనున్నారు ఆ తర్వాత పక్కనే ఉన్న బిఆర్ఎస్ బహిరంగ సభకు హాజరుకానున్నారు. 3.30 గంటలకు సభ ప్రారంభం కానుండగా మొదట కేరళ ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. నాలుగు గంటలకు అక్కడ నుంచి బయలు దేరి ఆయన విజయవాడ మార్గం ద్వారా కేరళ వెళ్ళనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అయిదు గంటలకు విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. కీలక అతిధులు ప్రసంగాల తర్వాత చివర్లో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారని పార్టీ నాయకులు తెలిపారు.