బీఅర్ఎస్ డబల్ స్పీడ్ తో అధికారంలోకి వస్తుంది: మాజీ సీఎం కేసిఆర్

బీఅర్ఎస్ డబల్ స్పీడ్ తో అధికారంలోకి వస్తుంది: మాజీ సీఎం కేసిఆర్
  • కొందరికి రాజకీయం... మనది ఉద్యమం...
  • తెలంగాణ తెచ్చింది నేను రాష్ట్ర ప్రజల నష్టపోవద్దని తపన నాకు ఉంటుంది
  • అధికారం శాశ్వతం కాదు మన తెలంగాణ హక్కులు శాశ్వతం: మాజీ సీఎం కేసిఆర్

ముద్ర ప్రతినిధి, నల్గొండ: బీఅర్ఎస్ డబల్ స్పీడ్ తో అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం కేసీఆర్ ధీమానిచ్చారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ లో మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన చలో నల్గొండ బహిరంగ సభ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై మాట్లాడుతూ కృష్ణానది, గోదావరి జలాలలో సంపూర్ణమైన మన వాట మన నీళ్లు మనకు దక్కే వరకు కృష్ణా నది పరిహార ప్రాంతంలో ఉన్న జిల్లాల ప్రజలు కలిసి పోరాడుతూనే ఉంటానన్నారు. నల్గొండ ప్రోగ్రామ్ తీసుకున్నాం ఎందుకు మనం ఈ సభ పెట్టవలసి వచ్చింది. మనం పెట్టింది ఉద్యమ సభ పోరాట సభ ఇది రాజకీయ సభ కానే కాదు కృష్ణా నదిలో మన జలాలు అనేది మన హక్కు, మన బతుకులకు జీవన్మరణ సమస్య బతుకు దిశ తేల్చే సమస్య ,తెలంగాణలో 24 సంవత్సరాల నుండి రాష్ట్ర మొత్తం తిరుగుకుంటూ చెప్తాను ఇది కృష్ణ కావచ్చు గోదావరి కావచ్చు నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు ,వేల మంది మునుగోడు, దేవరకొండ ఇతర ప్రాంతాల బిడ్డలు ఫోరోసిస్ బాధతో నడుములు వంగిపోనాయి, ఉద్యమకారులు అందరు కలిసి ప్రధానమంత్రి టేబుల్ మీద పడుకోబెట్టి మా బతుకులు ఈ విధంగా ఉన్నాయని చేసినారు.

ఆనాటి ప్రభుత్వాలు నల్గొండలో ఎవరు పట్టించుకోలేదు, ఫోరోసిస్ మహా మారని పూర్తిగా తరిమికొట్టి,నిర్మూలించింది టిఆర్ఎస్ పార్టీ  ఏ నాయకుడు పట్టించుకోలేదు.ఓట్లు ఉన్నప్పుడు వస్తారు కథలు చెప్పి ఆ తర్వాత ఎవరురారు. రాష్ట్ర ప్రభుత్వానికి కాదు రాష్ట్ర నాయకులు కాదు నీళ్లు పంచటానికి సిద్ధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం నీటిపారుదల మంత్రిగాని మన నీళ్లును తప్పించే అనే స్వార్ధ శక్తులకు గాని ఒక హెచ్చరిక చలో నల్గొండ సభ ఉమ్మడి ఖమ్మం,నలగొండ ,మహబూబ్నగర్ సంగారెడ్డి హైదరాబాద్ ఐదు జిల్లాల ప్రజల యొక్క జీవన్మరణ సమస్య అందరి ఆశీస్సులతోనే ఉద్యమాన్ని ఉధృతం చేసిన తెలంగాణను తెచ్చుకున్నాం. ప్రతి ఇంట్లో నల్ల పెట్టి మంచినీళ్లు అందించాం, ఒకనాడు ఆముదాల పండిన నల్గొండలో  లక్షల టన్నుల ఒడ్లు పండించే పరిస్థితిని తెచ్చుకున్నాం, ఆరోజు జలసాధన ఉద్యమంలో మండలానికి సమయం వెచ్చించి ప్రజలను చైతన్యం చేసాం, నేటికీ గోదావరి కృష్ణ నదుల నీళ్లు తెచ్చుకునే ప్రయత్నం చేసాం, భువనగిరి వద్ద బసవపురం ప్రాజెక్టు కంప్లీట్ అయింది, డిండి ప్రాజెక్టు కంప్లీట్ , పాలమూరు ఎత్తిపోతల కోసం ప్రారంభం కోసం మునుగోడు, దేవరకొండ ఎదురుచూస్తుంది. పది సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా కేసులు వేస్తూ ఇబ్బందులకు గురిచేసిన 10 సంవత్సరాలుగా ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోయాం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నీటి వాటాలో ఒక సంవత్సరం సర్దుబాటు చేసుకోరని సందేశం పంపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనంతరం ఏర్పడిన బిజెపి ప్రభుత్వం మోడీకి వందల ఉత్తరాలను పంపించాం ఇప్పటికైనా నీళ్ల పంచాయతీని తెంపండి ట్రిబ్యునల్ కు పంపించండని కోరాము. విషయం తేల్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లి తగాదాలు చేశాం గట్టిగా ప్రయత్నాలు చేసే మీరు కేసును వెనక్కి తీసుకోండి మేము నీటి వాటాలను పంచుతామని చెప్పినారు.

అయినా వాటాన్ని తేల్చలేదు లోక్సభ ని స్తంభింప చేసాము, ఆ ఒత్తిడికి వెనక్కి తగ్గి ట్రిబ్యునల్కు కేసును పంపించారు. ప్రజలు గాలి గాలి అయి పాలిచ్చే బర్రెని అమ్మి దున్నపోతును తెచ్చుకున్నారు. కేఎంబిఆర్ రిజర్వాయర్కు అప్పజెప్పింది నా కాలే కట్టే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస వరకు పులిలాగా కొట్లాడుతాను తప్ప పిల్లిలాగా ఉండను  కెసిఆర్ నల్గొండ సభను పెడితే ఇజ్జతి పోతదని అప్పటికప్పుడే అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు, నాడైనా నేడైనా వాళ్లకి పదవులు కావాలని ప్రజల హక్కులు అవసరం లేదు మనం పిడికిలి బిగించి మన హక్కులను మనమే కాపాడుకోవాలి ఎవరు కాపాడారు. ఎవరికి అధికారం శాశ్వతం కాదు తెలంగాణ ప్రజలకు హక్కులు శాశ్వతం స్వరాష్ట్ర సాధన ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిని అర్థం నుంచి 24 గంటల కరెంటు రైతులకు అందజేశాం. కెసిఆర్ ప్రభుత్వం పోగానే కటక బంజేస్తే పోయినట్టు పోతుంది. దద్దమ్మల పాలన ఉంటే ఇలానే ఉంటుంది కాంగ్రెస్ నాయకులను కరెంటు ఏమైందని ఎక్కడికక్కడ నిలదీయాలి. మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలంలోని 4వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటుని నిర్మించాం. జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో 80 నుండి 90% పనులు పూర్తయినాయి, అవి కష్టపడి చేసేస్తే రెండు మూడు నెలల్లో 4000 మెగా వాట్ల పవర్ వస్తది, రామగుండంలో మొదలు పెట్టినటువంటి ఎన్టి,పిసి పవర్ ప్లాంటు వచ్చేసింది ఆల్రెడీ ఇంకో వెయ్యి మెగావాట్లు రాబోతుంది, ఆనాడు నడిపినదాన్ని ఉన్నదానికంటే 5600 మెగావాట్ల పవర్ ఎక్కువ ఉంది.

 ప్రజలను కరెంటుకు, నీళ్లకు, మంచినీళ్లకు, తిప్పలబెట్టిన ఎక్కడికక్కడ నిలబెడతాం .ప్రజలు మీకు ప్రభుత్వం బాధ్యత ఇచ్చారు మాకు ప్రతిపక్షం బాధ్యత ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతులకు కరెంటును అందించిందో అదే విధంగా పునరుద్ధరించాలని హెచ్చరిస్తున్నానని అన్నారు. చరిత్రలో ఎన్నడు లేని విషయం ఏమిటంటే అసెంబ్లీలోనే జనరేటర్ పెట్టినారు. కృష్ణా నదిలో విజయ్ క్రిమినల్  లో మన వాటా తేలేంతవరకు మన నీల హక్కుల మనకు దక్కేవరకు ప్రతి సందర్భంలో ఐదు జిల్లాల ప్రజలు కృష్ణ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎప్పటికప్పుడు కూడా  పోరాడినందుకు సిద్ధంగా ఉండాలి. తెలంగాణ తెచ్చిన బిడ్డను నాకు గర్జు, ఫికర్ ఉంటది నేను అట్లనే కొట్లాడుతా విజయ్ కుమార్ ట్రిబునల్  ఆరు నెలల్లో తేల్చండి కేంద్ర మీద ఒత్తిడి తేవాలినీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు ,పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు , లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, మాజీ పురపాలక శాఖ మంత్రి కేటీ తారకరామారావు పల్లె రాజేశ్వర్ రెడ్డి, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇతర ముఖ్య నాయకులు , కార్యకర్తలు తదితరులు ఉన్నారు.