కాంగ్రెస్ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా బడుగు లింగం

కాంగ్రెస్ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా బడుగు లింగం

ఇల్లంతకుంట ,ముద్ర:రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామానికి చెందిన బడుగు లింగం ను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు భూంపల్లి రాఘవ రెడ్డి, మాజి అధ్యక్షుడు పసుల వెంకటి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తానని, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సాయశక్తుల కృషి చేస్తానని లింగం తెలిపారు.