నారా భువనేశ్వరుని కలిసిన బక్కని

నారా భువనేశ్వరుని కలిసిన బక్కని

ముద్ర/షాద్ నగర్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్పర్సన్ నారా భువనేశ్వరుని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు బక్కని నర్సింలు కలిశారు. మంగళవారం హైదరాబాద్ లో ని ఎన్టీఆర్ భవన్ లో నారా భువనేశ్వరుని మర్యాదపూర్వకంగా కలిసి ఎంతో పవిత్రమైన కదంబ పుష్పాలను అందజేశారు. బక్కను నరసింహులు ఇచ్చిన ఈ పుష్పాలను చూసి నారా భువనేశ్వరి ఎంతో ఉప్పొంగి పోయారు. కదంబ పుష్పాలు అరుదుగా లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంటు అధ్యక్షులు అశోక్ కుమార్ గౌడ్ లు ఉన్నారు.