రూపిరెడ్డీ పల్లి గ్రామంలో బలగం మూవీ ప్రదర్శన

రూపిరెడ్డీ పల్లి గ్రామంలో బలగం మూవీ ప్రదర్శన

మూవీ ప్రదర్శన పట్ల ఆనందం వ్యక్తం చేసిన గ్రామస్తులు

ముద్ర న్యూస్ రేగొండ: మానవ సంబందాలను ఆవిష్కరించిన గొప్ప సినిమా బలగం. పల్లె పల్లెన.. ప్రతి గడపల్లో ఉండే నిజమైన సంఘటనలను కళ్లకు కట్టేలా చూపించిన సినిమా.. ఎంతో మంది ఆదరాభిమానాలు పొందుతున్న ఈ సినిమాను ఇప్పుడు గ్రామాల్లో పెద్ద స్క్రీన్ పై ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే జయశంకర్  భూపాల్పల్లి  జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డీ పల్లి గ్రామంలో రూపిరెడ్డీ నర్శింహ్మ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు రూపిరెడ్డీ చంద్రా రెడ్డి భగవాన్ రెడ్డి లు గ్రామంలో వారి ఇంటి దగ్గర ప్రదర్శించారు.

అయితే సినిమా చూస్తూ.. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ కన్నీరు పెట్టుకున్నారు.బలగం మూవీ ప్రదర్శన పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు ఈమూవీ చూసేందుకు గ్రామ సర్పంచ్ బండారి కవిత దేవేందర్ ఎంపీటీసీ ఐలి శ్రీధర్ గౌడ్ తెరాస గ్రామ కమిటీ అధ్యక్షుడు పంచగిరి సుధాకర్ పల్నాటి శ్రీనివాస్ బాబు రావు అశోక్ మల్లిక్ గ్రామస్తులు ఉన్నారు