రైతు,కార్మిక,కూలి సమస్యలనుపరిష్కరించాలి

రైతు,కార్మిక,కూలి సమస్యలనుపరిష్కరించాలి
  • రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి బాల్ రెడ్డి

ముద్ర. వీపనగండ్ల:-తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ల ఆధ్వర్యంలో బిజెపి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా గ్రామీణ బంధు, మండలంలో మండల కేంద్రం, 8 గ్రామాలలో స్వచ్ఛందంగా బంధు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అనంతరం మండల కేంద్రంలో బస్టాండ్ నుండి గ్రామంలో పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో సభ నిర్వహించ్చారు.ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి బాల్ రెడ్డి మాట్లాడుతూ  బిజెపి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం  చేసి కార్పొరేటర్ శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తుందన్నారు. కేంద్రం అశాస్త్రయంగా నిర్ణయించిన కనీసం మద్దతులకంటే తక్కువ అమ్మడం వల్ల ఏటా రైతులు నాలుగు లక్షల కోట్లు నష్టపోతున్నారు నేటికి పంటల ప్రణాళిక లేకపోవడంతో రైతులు పెట్టిన పెట్టుబడి రాక అప్పులు తీరక ఆత్మహత్నలు పాల్పడుతున్నారని  విమర్శించ్చారు.

ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలో రాతపూర్వకమైన హామీల నేటికీ అమలు చేయకపోవడం ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ తక్కువ కేటాయించడం వల్ల ఆ పథకాన్ని నిర్వీర్యం చేయాలని ఆలోచనలు కేంద్ర ప్రభుత్వం ఉంది. దీనిని వెంటనే విరమిచ్చుకొని బడ్జెట్ పెంచాలన్నారు. నాలుగు లేబర్ కోడలు రద్దు చేయాలని విద్యుత్ సవరణ బిల్లు 2022 కావాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. స్కీం వర్కర్లుగా పనిచేస్తున్న అంగన్వాడీలకు ఆశ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, హమాలి  కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, రవాణా రంగ కార్మికులకు రక్షణ కల్పించాలని, గ్రామ పంచాయతీలకు వేతనాలు పెంచాలని, VBK లను పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు ఎం కృష్ణయ్య, కార్యదర్శి మహబూబ్బాషా, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు వి కృష్ణయ్య, ఆర్ మౌలాలి,KVPS మండల అధ్యక్షులు మురళి, CITU మండల కన్వీనర్ బాలగౌడ్ నాయకులు బాలకృష్ణ, రంగస్వామి, ఆశన్న, రాముడు, సుగుణభాయ్,సుజాత,రేణుక,ఈశ్వరయ్య,శ్రీను,అశోక్ రెడ్డి, సత్యం, రైతు సంఘం నాయకులు ఈశ్వర్, ఖాజా హుస్సేన్,శేఖర్ రెడ్డి,వెంకటేశ్వర్లు గౌడ్, ఎస్ఎఫ్ఐ నాయకులు రామకృష్ణ, నవీన్,DYFI నాయకులు నాగరాజు,PNM నాయకులు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.