నేటి నుంచి బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర

నేటి నుంచి బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర

ముద్ర,కరీంనగర్:- బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర శనివారం నుంచి ప్రారంభం కానుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో పాదయాత్ర కొనసాగనుంది. ఇవాళ వేములవాడ సెగ్మెంట్ పరిధిలో బండి సంజయ్ పర్యటించనున్నారు. నేడు మేడిపల్లి, బీమారం, కథలాపూర్ మండలాల్లో బండి సంజయ్ పర్యటించనున్నారు.

తొలి విడతలో ఈ నెల 10 నుంచి 15 వరకు ప్రజాహిత పాదయాత్ర కొనసాగనుంది. తొలి విడతలో వేముల వాడ, సిరిసిల్ల సెగ్మెంట్లలో బండి సంజయ్  పాదయాత్ర చేపట్టనున్నారు. నిన్న జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో బీజేపీ అధ్యక్షులు మోరపల్లి సత్యనారాయణరావు, ప్రతాప రామకృష్ణ ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామాల్లో కాలినడకన, బయటకు వచ్చాక వాహనంలో యాత్ర కొనసాగించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.