మోర్చాల సభ్యత్వ నమోదు వర్క్ షాపు కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కామెంట్స్...
- హైదరాబాద్ నాగోలులోని శుభం కన్వెన్షన్ హాలులో జరుగుతున్న వివిధ మోర్చాల సభ్యత్వ నమోదు వర్క్ షాపు కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కామెంట్స్...
- దేశవ్యాప్తంగా 10 కోట్ల మందిని బీజేపీ సభ్యులుగా మార్చడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు
- ప్రపంచంలోనే అత్యదిక సభ్యత్వమున్న ఏకైక పార్టీ బీజేపీ
- తెలంగాణలో అత్యధిక మందిని బీజేపీ సభ్యులుగా చేర్పించండి
- 8800002024 నంబర్ కు మిస్డ్ కాల్ చేయండి... బీజేపీ సభ్యులుగా చేరండి
- తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి 77 లక్షల ఓట్లు వచ్చినయ్
- 77 లక్షల మందిని బీజేపీ సభ్యులుగా చేర్పించేందుకు ప్రయత్నించండి
- కార్యకర్తల కష్టంవల్లే మోదీ ప్రధాని అయ్యారు. నేను ఎంపీనయ్యాను
- కార్యకర్తలు తలుచుకుంటేనే బీజేపీ సభ్యత్వ లక్ష్యం నెరవేరుతుంది
- పాతబస్తీలో లక్ష మందిని బీజేపీ సభ్యులుగా చేర్పించండి.. ఓల్డ్ సిటీని న్యూసిటీగా మారుద్దాం
- ఒక్కో మోర్చాకు నిర్దేశించిన సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని అధిగమించినోళ్లకు ప్రధానితో సన్మానం చేయిస్తా
- బీజేపీకి, ఇతర పార్టీలకు ఉన్న తేడాను వివరించి బీజేపీ సభ్యులుగా మార్చండి
- దేశాన్ని ముక్కలు చేసిన పార్టీ కాంగ్రెస్
- 370 ఆర్టికల్, బాబ్రీ మసీదు, వక్ఫ్, మైనారిటీ చట్టాలతోపాటు కుటుంబ పాలన, రాచరిక పోకడలతో దేశ, ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టిన పార్టీ కాంగ్రెస్
- సిద్దాంతం కోసం మంత్రి పదవులనే వదులుకున్న పార్టీ బీజేపీ
- దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ సిద్దాంతాన్ని అమలు చేసి 25 కోట్ల మందిని పేదరికం నుండి విముక్తి కలిగించిన పార్టీ బీజేపీ
- దేశ రక్షణ కోసం అణ్వస్త్రాలు ఉండాలని దీన్ దయాళ్ ఆశిస్తే... అమలు చేసిన ఘనత ప్రధాని వాజ్ పేయి దే
- 370 ఆర్టికల్ రద్దు కోసం శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదానం చేస్తే... ఆ స్పూర్తితో 370 ఆర్టికల్ ను రద్దు చేసిన మహనీయుడు నరేంద్ర మోదీ
- మహిళలకు సమాన హక్కులు, వేతనాలివ్వాలని పార్లమెంట్ లో అంబేద్కర్ అడిగితే...అవమానించిన పార్టీ కాంగ్రెస్
- అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మహిళలకు చట్టసభల్లోనూ 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత బీజేపీదే
- ఉచిత బియ్యం పొందుతున్న 80 కోట్ల మంది బీజేపీ సభ్యులుగా మారండి
- ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు పొందిన ప్రతి మహిళ బీజేపీ సభ్యులుగా మార్చండి
- బీజేపీ ప్రభుత్వ ఫలాలు పొందిన ప్రతి ఒక్కరినీ బీజేపీ సభ్యులుగా మార్చండి
- కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు ఈ దేశానికి చేసిన త్యాగాలేమిటి?
- ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్ గాంధీల కుటుంబ పార్టీ కాంగ్రెస్
- తెలంగాణ కోసం 1400 మంది యువత బలిదానం చేస్తే... వాళ్ల త్యాగాలతో అధికారాన్ని అనుభవించిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదే...
- కాంగ్రెస్ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం
- హైడ్రా కూల్చివేతల విషయంలో ఒవైసీకి ఒక న్యాయం? ఇతరులకు మరో న్యాయమా?
- సకలం చెరువును ఆక్రమించిన ఒవైసీ విద్యా సంస్థలకు ఎందుకు నోటీసులివ్వరు?
- మా సంస్థలపై చెయ్యేస్తే అంతు చూస్తామని ఒవైసీ బెదిరిస్తే చేతులు ముడుచుకు కూర్చోవడానికి సిగ్గులేదా?
- ఒవైసీ అరాచకాలను అణిచివేసి హిందువులకు భరోసా కల్పించేందుకే పాతబస్తీ నుండి ప్రజాసంగ్రామ యాత్ర స్టార్ట్ చేసి సత్తా చాటినం
- ఎస్టీలపై బీఆర్ఎస్ చేసిన అరాచకాలు ఇంకా నా కళ్ల ముందు మెదులుతున్నాయి
- వడ్ల కొనుగోలు కేంద్రాలకు వెళితే బీఆర్ఎస్ చేసిన దాడుల్లో రైతుల, కార్యకర్తల తలలు పగిలిన దారుణ సంఘటనను మర్చిపోదామా?
- ప్రజా సంగ్రామ యాత్రపై బీఆర్ఎస్ గూండాలు దాడి చేసి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఘటనను మరువలేం
- బీఆర్ఎస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు
- సిగ్గులేకుండా బీఆర్ఎస్ పార్టీ డ్రామాలాడుతోంది
- బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది
- బీఆర్ఎస్ విలీనం ప్రసక్తే లేదు... ఆ పార్టీ అంతు చూస్తాం
- 2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యం
- కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద డ్రామా కంపెనీ
- రుణమాఫీ సర్వే పేరుతో మళ్లీ కాంగ్రెస్ డ్రామాలు స్టార్ట్ చేసింది.
- రుణమాఫీ ఎంతమందికి వర్తించింది. ఇంకా అర్హులెందరున్నారో బ్యాంకుల వద్ద అన్ని వివరాలుండగా మళ్లీ సర్వే ఎందుకు?
- కాలయాపన చేసేందుకు కాంగ్రెస్ రకరకాల డ్రామాలు
- 6 గ్యారంటీలపై ప్రజల ద్రుష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ ను మించి కాంగ్రెస్ జిమ్మిక్కులు చేస్తోంది
- హైడ్రా దాడులు, విగ్రహాల లొల్లి, రుణమాఫీ సర్వే పేరుతో డ్రామాలాడుతోంది
- తెలంగాణలో రామరాజ్యం తథ్యం...
- కార్యకర్తలారా.....రామరాజ్యం స్థాపన కోసం నడుం బిగించి పోరాడండి
- ఏ స్వార్ధ్యం లేకుండా పోరాడిన వాళ్లే నిజమైన బీజేపీ కార్యకర్తలు
- తెలంగాణలో అతి తక్కువ కాలంలో తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీ కాంగ్రెస్
- స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడే కార్యకర్తలకు టిక్కెట్లు ఇవ్వాలన్నదే పార్టీ లక్ష్యం
- బీజేపీ సభ్యత్వ నమోదును కార్యకర్తలంతా సీరియస్ గా తీసుకోవాలి
- సామాన్య కార్యకర్తలు ప్రధానమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా, రాష్ట్ర అధ్యక్షులుగా ఎదిగిన చరిత్ర ఒక్క బీజేపీలోనే సాధ్యం
- నేను ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రి అవుతానని కలలో కూడా ఊహించలేదు
- 2019కి ముందు నార్త్ బ్లాక్ లోకి వెళ్లలేక బయట నుండే సెల్ఫీ తీసుకున్న చరిత్ర నాది
- నేడు అదే నార్త్ బ్లాక్ లో కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న
- గుర్తింపు కోసం ఎవరూ పనిచేయాల్సిన అవసరం లేదు
- కష్టపడి కమిట్ మెంట్ తో పనిచేస్తే బీజేపీలో గుర్తింపు తధ్యం
- స్థానిక సంస్థల్లో టిక్కెట్ ఆశిస్తున్న నాయకులంతా... మీ మీ గ్రామాలు, మండలాల్లో అత్యధిక సభ్యత్వం చేయించండి
- కవితకు బీజేపీ బెయిల్ ఇప్పించిందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది
- బెయిల్ కు, బీజేపీకి ఏం సంబంధం
- ఒక పార్టీ, ఒక వ్యక్తి చెబితే సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందనడం సిగ్గు చేటు
- సుప్రీంకోర్టును ధిక్కరించేలా కాంగ్రెస్ వ్యాఖ్యలున్నాయి. అందుకే కోర్టు హెచ్చరించింది
- కవిత బెయిల్ కోసం వాదించిన అభిషేక్ సింఘ్వీకి కాంగ్రెస్ తెలంగాణలో రాజ్యసభ టిక్కెట్ ఇచ్చింది నిజం కాదా?
- రాజ్యసభ ఎన్నికల్లో 38 మంది ఎమ్మెల్యేలున్నా బీఆర్ఎస్ ఎందుకు నామినేషన్ వేయలేదు?
- కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఒప్పందంవల్లే రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదు
- కాంగ్రెస్, బీఆర్ఎస్ విలీనం మాట ముచ్చట పూర్తయ్యింది... అమెరికాలో అప్పగింతలు కాబోతున్నయ్
- బీఆర్ఎస్ తో కలిసి పనిచేసి పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్ దే
- బీఆర్ఎస్ తో బీజేపీ కార్యకర్తలు కొట్లాడితే... అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్
- బీఆర్ఎస్ గడీలను బద్దలు కొట్టిన చరిత్ర బీజేపీదే
- బీజేపీ కుటుంబ, అవినీతి పాలనకు వ్యతిరేకం... కలలో కూడా బీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తే లేదు
- కుటుంబ పాలన, అవినీతికి మారుపేరైన బీఆర్ఎస్ ను బీజేపీలో ఎందుకు చేర్చుకుంటాం?
- కుటుంబ పాలన, అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే
- ఆ రెండు పార్టీలు విలీనం కావడం తథ్యం