తెలంగాణలో కాంగ్రెస్కు 14 సీట్లు

తెలంగాణలో కాంగ్రెస్కు 14 సీట్లు
  • ప్రముఖసినీ నిర్మాత బండ్ల గణేష్ 
  • షాద్ నగర్ లో కుటుంబ సభ్యులతో ఓటు వేసిన బండ్ల గణేష్ 

ముద్ర, షాద్ నగర్:తెలంగాణ రాష్ట్రంలో ఒకటే లెక్క 14 పక్క అన్నట్టు తమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారద్యంలో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించబోతుందని ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పష్టం చేశారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో రైతు కాలనీలో గల బూత్ నంబర్248 లో నిర్మాత బండ్ల గణేష్ ఆయన సతీమణి తదితర కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో కాసేపు మాట్లాడారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అంతా కొత్త పరిస్థితులు ఏర్పడ్డాయని ఒకటే లెక్క 14 పక్క అన్న రేవంత్ రెడ్డి నినాదం రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లలో కొనసాగుతుందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుందని ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. దేశంలో మంచి రోజులు వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కీలక ప్రభుత్వం ఏర్పడబోతుందని ఆయన తన అభిప్రాయం తెలిపారు