సమస్యలు దాచేందుకే సంఘాలపై నిషేధం

సమస్యలు దాచేందుకే సంఘాలపై నిషేధం
  • టి జె ఎస్  ధ్వజం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ళలో నెలకొన్న సమస్యలు కప్పి పుచ్చేందుకే విద్యార్థి సంఘాలను,పత్రిక విలేకరులను రానివ్వవద్దని ఆదేశాలిచ్చారని తెలంగాణ జన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ విమర్శించారు. ఆదేశాలిచ్చే అర్హత ప్రభుత్వానికి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కు  లేదని ఆయన అన్నారు. శుక్రవారం నిర్మల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో,హాస్టళల్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేయలేని ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న విద్యార్థి సంఘాలు మీడియా,పత్రికలపై నిషేధ ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని, దానిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.స్కూళ్లు,ప్రభుత్వ హాస్టళ్లలలో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమై,ఈ దుస్థితి బయట పడుతుందని ప్రభుత్వానికి  భయం పట్టుకుందని ఆరోపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న రూ.5000 వేల కోట్ల ఫీజు రీ ఇంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇంటర్ కాలేజీలలో మద్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని,ప్రభుత్వ యూనివర్శిటీలలో ఖాళీగా ఉన్న అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను భర్తీ చెయ్యాలని కోరారు. ఈ సమావేశంలో  రాష్ట్ర కార్యదర్శి తులసి రామ్,  నాయకులు సతీష్,మీనాజ్, రాజు తదితరులు పాల్గొన్నారు.