మమ్మల్ని బెదిరిస్తున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే

మమ్మల్ని బెదిరిస్తున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను మోసం చేశాడని, తన వద్దకు అమ్మాయిలను పంపించాలని, కోర్కెలు తీర్చాలని బెదిరిస్తున్నాడని ఆరిజిన్​డెయిరీ నిర్వాహకులు ఆదినారాయణ, శేజల్​ ఆరోపించారు. అడిగిన డబ్బులు ఇవ్వలేదని కక్షగట్టి తప్పుడు కేసులు పెట్టించి తమను అరెస్టు చేయించాడన్నారు. బెల్లంపల్లిలో డెయిరీ ఏర్పాటుకు సహకరించినందుకుగానూ బిజినెస్​లో తనవాళ్లకు వాటా కోరడమే గాకుండా తన కోర్కెలు తీర్చాలని వేధించడంతో బ్రోకర్ల ద్వారా హైదరాబాద్​లోని ఎమ్మెల్యే క్వార్టర్​కే అమ్మాయిలను పంపించినట్టు ఆదినారాయణ ఆరోపించాడు. దీనికి సంబంధించి చిన్నయ్య 91606 13141 ఫోన్ నంబర్ నుంచి అమ్మాయిలను ‘ట్యాబ్లెట్’ అంటూ కోడ్ లాంగ్వేజ్​లో చేసిన వాట్సాప్ చాటింగ్ గా పేర్కొంటూ కొన్ని స్ర్కీన్ షాట్లు, యువతుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయం రాష్ట్రంలో హాట్ టాపిక్​గా మారింది. ఎమ్మెల్యే తీరుపై రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ అంశంపై బీఆర్ఎస్ హైకమాండ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కోరినట్టు తెలిసింది.