భైంసా ఆర్టీసీ డిపో మేనేజర్ సస్పెన్షన్

భైంసా ఆర్టీసీ డిపో మేనేజర్ సస్పెన్షన్

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా భైంసా ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం అమృతను నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆదిలాబాద్  డిప్యూటీ రీజినల్ మేనేజర్ ప్రణీత్ వివరాల  ప్రకారం భైంసా డిపో పరిధి లోని ముధోల్, బాసర బస్ స్టేషన్లలో ప్రయాణికులకు సౌకర్యాల కల్పనకు కేటాయించిన నిధులను దుర్వినియోగం చేసినందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు.  ఈ ప్రాంతాల్లో పనులు పూర్తి చేయకుండానే బిల్లులు చేసి వాడుకున్నట్లు తెలుస్తోంది. కరీం నగర్ జోనల్ ఈ డీ ఇచ్చిన ఆదేశాల మేరకు నిజామాబాద్ డిప్యూటీ ఆర్ ఎం విచారణ చేపట్టారు. విచారణలో ఆరోపణ రుజువు కావడంతో ఈ చర్య తీసుకున్నారు.