వీపనగండ్ల శ్రీ చెన్నకేశవ భజన మండలి చే టీటీడీ దేవస్థానంలో భజన సంకీర్తనలు

వీపనగండ్ల శ్రీ చెన్నకేశవ భజన మండలి చే టీటీడీ దేవస్థానంలో భజన సంకీర్తనలు

ముద్ర /వీవనగండ్ల:- వీపనగండ్ల శ్రీ చెన్నకేశవ భజన మండలి భక్త బృందం తిరుమల తిరుపతి దేవస్థానంలో భజన సంకీర్తనలు ఆలపించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీ చెన్నకేశవ భజన మండలి సభ్యులకు దేవస్థానం నుంచి ఆహ్వానం అందడంతో భజన మండలి సభ్యులు తిరుపతికి వెళ్లి అఖండ భజనలో పాల్గొని భజన సంకీర్తనలు ఆలపించారు. అనంతరం దేవస్థానం వారు భజన మండలి సభ్యులను సన్మానించి ఉచిత దైవదర్శనం కల్పించారు. కార్యక్రమంలో భజన మండలి సభ్యులు కోట్రా శ్రీకాంత్, సుధాకర్ రెడ్డి, నారాయణరెడ్డి, వెంకటయ్య, కురుమయ్య, జగదీశ్వర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, నరసింహ, శ్రీధర్ రెడ్డి,వెంకట్ రెడ్డి, రామచంద్రారెడ్డి, రాముడు తదితరులు ఉన్నారు.