స్కాన్ ఎనర్జి పరిశ్రమలో  భారీ పేలుడు.. 

  • షేడ్ కు అంటుకున్నమంటలు
  • కార్మికులకు తీవ్ర గాయాలు.. 

ముద్ర,షాద్ నగర్: షాద్ నగర్ నియోజక వర్గం కొందుర్గు మండల కేంద్రంలోని స్కాన్ ఎనర్జీ ప్రైవేటు పరిశ్రమలో భారీ పేలుడు సంభవించడంతో కార్మికులు గాయాల పాలయ్యారు..దీంతో పనిలో నిమగ్నమైన కార్మికులపై వేడి ద్రవం పడినట్లు స్ధానికులు చెపుతున్నారు. తీవ్రంగా గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం షాద్ నగర్ కు  తరలించారు. పేలుడుతో పరిశ్రమ మొత్తం దట్టమైన పొగ  అలుముకోవడంతో కార్మికులు బయటికి పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. పేలుడు జరిగినప్పుడు బీతావాహ పరిస్థితి ఏర్పడినట్లు కార్మికులు చెబుతున్నారు.