మా నాన్నని మూడోసారి ఆశీర్వదించండి పైళ్ల మన్విత రెడ్డి

మా నాన్నని మూడోసారి ఆశీర్వదించండి పైళ్ల మన్విత రెడ్డి

భూదాన్ పోచంపల్లి ,ముద్ర: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి నీ మూడోసారి ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కూతురు పైళ్ల మన్విత రెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్, రేవనపల్లిలో తండ్రి గెలుపు కోసం ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిఆర్ఎస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధి పనులు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.

సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరోసారి సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిట్టిపొలు విజయలక్ష్మి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు సీత వెంకటేష్, నాయకులు తడక రమేష్, కౌన్సిలర్లు దారెడ్డి మంజుల వేణుగోపాల్ రెడ్డి, కొంగరి కృష్ణ , వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దొడ్డమోని చంద్రం యాదవ్,మాజీ సర్పంచ్ మునుకుంట్ల బాలచంద్రం,నాయకులు గుణిగంటి మల్లేష్ గౌడ్, నక్క రాజిరెడ్డి, సిద్ధగోని రాజ మల్లేష్, కొండమడుగు రోషన్, మహిళా అధ్యక్షురాలు గుండు రాజేశ్వరి, విజయ, చింతకింది కిరణ్ పాల్గొన్నారు.