యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ముద్ర.వనపర్తి:- వనపర్తి జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు.యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కాగితాల మధు మాట్లాడుతూ  మాతృభూమి కోసం సుమారు 4 యేండ్ల క్రితం ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా బాంబు దాడిలో సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందడం జరిగిందని,వీరమరణం పొందిన సైనికులను స్మరించుకుంటూ యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో ప్రతేకంగా శివ స్వాములు పాల్గొన్నారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు గొబ్బూరు నవీన్, ఫౌండేషన్ చైర్మన్ సాయి తేజ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన యువతీ యువకులు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని అన్నారు.బ్లాక్ డే సందర్బంగా చేశారు.యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కాగితాల మధు 60 వ సారి రక్తదానం చేశారు.కార్యక్రమంలో ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు గొబ్బూరు నవీన్, ఫౌండేషన్ జిల్లా చైర్మన్ సాయి తేజ, ఫౌండేషన్ సభ్యులు నందిమల్ల శ్రీకాంత్, కురుమూర్తి, చందు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.