శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు కాల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు కాల్

గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా విమానాలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అధికారులు. పోలీసులు అప్రమత్తమయ్యారు. మూడు విమానాల్లో తనిఖీలు నిర్వహించారు. కాగా దేశ వ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపు కాల్‌లు వస్తుండటం సంచలనం సృష్టిస్తోంది.

నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళుతున్న ఇండిగో విమానంలో బాంబ్ పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు విమానయాన సిబ్బందికి ఫోన్ చేసి బెదిరించారు. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ భద్రత సిబ్బంది విమానంలో తనిఖీలు చేపట్టారు. విమానంలో ఉన్న 130 మంది ప్రయాణికులు కిందకు దింపి చెక్ చేశారు. ఇప్పుడు తాజాగా మళ్లీ బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో ప్రయాణీకులు భయాందోళనలు చెందుతున్నారు.