శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాలు అంగరంగా వైభ‌వ‌ముగా జరుగుతున్నాయి..

శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాలు అంగరంగా వైభ‌వ‌ముగా జరుగుతున్నాయి..

దేవాతాహ్వాన‌ం, ధ్వజారోహనం...
ముద్ర ప్రతినిధి భువనగిరి : తెలంగాణలో ప్రసిద్ధ పుణ్య‌క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాలు స్వస్తివచనముతో ప్రారంభమై రెండవ రోజయిన మంగళవారం దేవాతాహ్వాన‌ము, ధ్వజారోహనము నిర్వ‌హించారు. బ్ర‌హ్మోత్స‌వాల‌లో అతి ప్రధానమైన ఘటం ధ్వజారోహనము.  ద్వజస్తంభం అధిపతి అయిన గరుత్మంతుని తెల్లటి వస్త్రంపై పసుపు, కుంకుమ, గంధముతో గరుత్మంతుని చిత్రపటాని వేసి అందులోనికి వేదమంత్రాలతో, మూర్తిమంత్రాలతో ఆవాహానము చేశారు. ఆలయ అర్చకులు. గరుత్మంతుని ఆవాహానము చేసిన చిత్ర పటానికి ద్వజస్తంభానికి కట్టి పసుపు, కుంకుమలతో చేసిన అన్నం ముద్దలను అరగింపుగా ఎగురవేసి నైవేద్యంగా సమర్పించి ముక్కోటి దేవతకు స్వామి వారి కళ్యాణ ఆహ్వాన‌ము గరుత్మంతుని ద్వారా అందచేశారు.

ఉపనిషత్తులలో శ్లోకాలతో, వేద పారాయ‌న‌ములతో అర్చకులు దేవతలను ఆహ్వానించారు. గరుత్మంతునికి నైవేద్యంగా సమర్పించిన అన్నం ముద్దలను భక్తులకు పంచి పెట్టారు. ఈ అన్నం ముద్దలను సంతాన‌ము లేనివారు తింటే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అన్నం ముద్దలకొరకు భక్తులు వివిధ ప్రాంతాల నుండి విశేషంగా తరలివచ్చారు. అనంత‌ర‌ము శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి వారిని ప్రత్యేక అలంకరణలో స్వామి వారు భక్తులకు దర్శనమిచారు.   మాడవీధుల్లో స్వామి వారి అలంకారా సేవ ఊరేగించారు. బ్ర‌హ్మోత్స‌వాల‌ రెండో రోజు ధ్వజారోహనము పేరుతో గరుత్మంతునికి ప్రత్యేక పూజలు చేయడంతోపాటు, ముక్కోటి దేవతలను వేదమంత్రాలతో, ప్రత్యేక పూజలతో ఆహ్వానించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.