అన్నపై కత్తిపీటతో తమ్ముడు దాడి.. ఆపై గుండు తో మోదీ హత్య..

అన్నపై కత్తిపీటతో తమ్ముడు దాడి.. ఆపై గుండు తో మోదీ హత్య..

ముద్ర ప్రతినిధి, నల్గొండ:- సొంత అన్నపై కత్తిపీటతో దాడి చేసి అతి దారుణంగా హత్య చేసిన సంఘటన  నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని పెరిక కొండారం  గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చర్ల పెళ్లి రాంబాబు  (27) అతని తమ్ముడు నవీన్ ఇద్దరు మధ్యాహ్నం పూట ఇంట్లో గొడవపడి. మాట మాట పెరిగి క్షణికావేశంలో  అన్నపై కత్తిపీటతో దాడి చేశాడు. చావు బతుకుల మధ్యన కొట్టు మిట్టాడుతుండగా పక్కనే ఉన్న గుండు రాయితో తలపై మోది హత్య చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.