టిఆర్ఎస్ నాయకులను అవమానిస్తే చూస్తూ ఊరుకోం

టిఆర్ఎస్ నాయకులను అవమానిస్తే చూస్తూ ఊరుకోం

ఇలాంటి చర్యలు పునరావృతం అయితే తగిన విధంగా బుద్ధి చెబుతాం

జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి పై దాడిని ప్రజాస్వామ్యక వాదులంతా ఖండించాలి

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షమాపణ చెప్పాలి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: వీధి రౌడీలా, బజారు వ్యక్తిలా బీఆర్ఎస్ నాయకుల పై దాడి చేస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తగిన విధంగా బుద్ధి చెబుతామని, జెడ్పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పై దాడిని ప్రజాస్వామిక వాదులంతా ముక్తకంఠంతో ఖండించాలని రాజ్యసభ సభ్యులు, నల్గొండ జిల్లా బీ ఆర్ఎస్ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ప్రభుత్వ కార్యక్రమంలో వీధి రౌడిలాగ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి తలవొంపులు అని సిగ్గుచేటని అన్నారు.కోమటిరెడ్డి చర్య ప్రజస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదని, ప్రజాస్వామ్య సమాజంలో దౌర్జన్యాలు, దాడులకు తావు లేదన్నారు.

ఇలాంటి దుర్మార్గపు చర్య ఇప్పటివరకు ఏ మంత్రి చేయలేదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు విషయంలో ప్రశ్నించినందుకే దాడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

మంత్రి అనే సోయిలేకుండా జెడ్పి చైర్మన్ ను నిందించడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు.

జిల్లా పరిషత్ చైర్మన్ గా క్యాబినెట్ ర్యాంకు హోదా కలిగి ఉండిప్రోటోకాల్ వ్యక్తి పై పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకం చేశారనీ ఆరోపించారు.

స్వర్గీయ ఎలిమినేటి మాధవ రెడ్డి , ఉమా మాధవ రెడ్డి లాంటి మచ్చలేని నాయకులుl కుటుంబానికి చెందిన వ్యక్తి పై ఇలాంటి చర్యా అని ప్రశ్నించారు.

కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసులతో ఏకమై గుండాయిజం చేస్తారా అని వాపోయారు.

ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలవకుండా ప్రవర్తిస్తున్న కోమటిరెడ్డి ఉదయం మాట్లాడేదానికి మధ్యాహ్నం మాట్లాడేదానికి పొంతన ఉండదని అదేవిధంగా మధ్యాహ్నం మాట్లాడేదానికి రాత్రి మాట్లాడడానికి పోలిక ఉండదని రాత్రి మాట్లాడి తెల్లారి మాట్లాడేదానికి అసలు సారూప్యమే ఉండదని ఎప్పుడూ ఏమీ మాట్లాడుతున్నాడో, సోయి లో ఉండి మాట్లాడుతున్నాడో మంత్రి వెంకట్ రెడ్డికి తెలియడం లేదన్నారు.

ప్రతిపక్షాల పై నిరంకుశం ఏంటి అని, కాంగ్రెస్ పాలన ఆటవిక పాలనను తలపిస్తుందనీ ఎద్దేవా చేశారు.

బీ ఆర్ఎస్ పాలనలో గత పదేళ్ల కాలంలో ఇలాంటి చర్యలకు ఎప్పుడు పాల్పడలేదనీ వివరించారు.

మీ చర్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారనీ,

ప్రజా సేవకు రావాల్సిన వాళ్ళు దోచుకునేందుకు లంకెబిందెలు దోలాడుతున్నారనీ, లంకె బిందెలు ఉన్నాయను కొని వస్తే ఖాళీ బిందెలు దర్శనమిస్తున్నాయని సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు.

ఇలాంటి చర్యల వల్ల ప్రజాభిమానం కోల్పోతున్న కాంగ్రెస్కు రానున్న లోక్సభ ఎన్నికల్లో పరాభవం తప్పదని జోస్యం. చెప్పారు

అహంకారంతో వ్యవహరించడం కోమటిరెడ్డి మానుకోవాలనీ హితవు పలికారు.

టిఆర్ఎస్ నాయకులను అవమానిస్తే ప్రతి చర్య తప్పదనీ హెచ్చరించారు.

జెడ్పి చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు మాట్లాడుతూ  

సందీప్ పై దాడిని ఖండిస్తున్నాం ఆని,

రక్షణ కల్పించాల్సిన పోలీసులే దాడి చేస్తారా ఆని ప్రశ్నించారు.

హామీల పై ప్రశ్నించినందుకే ముమ్మాటికీ దాడి చేశారని,

వ్యక్తిగతంగా దుర్భాశలాడటం తగదనీ,

కాబినెట్ హోదా గల వ్యక్తి పై దుర్మార్గంగా వ్యవహరించారనీ, కాంగ్రెస్ పాలన

50 రోజులు కాక ముందే దాడులకు దిగుతున్నారనీ ఆరోపించారు.

ఇతరులకు మార్గదర్శకంగా ఉండాల్సిన మంత్రులే ఇలా చేయాల్సి రావటం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని,

సందీప్ రెడ్డి కి మంత్రి కోమటిరెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలనీ డిమాండ్ చేశారు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో బీ ఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎలగందుల వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, పెన్ పహాడ్ ఎంపీపీ నెమ్మాది భిక్షం, సీనియర్ నాయకులు ఉప్పల ఆనంద్, కోడి సైదులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.