బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు దారుణ హత్య

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు దారుణ హత్య

ముద్ర.వనపర్తి: ఉమ్మడి వీపనగండ్ల మండలంలోని లక్ష్మీపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. గ్రామస్తుల కథన ప్రకారం లక్ష్మీ పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు శ్రీధర్ రెడ్డి(51) గ్రామానికి సమీపంలో ఉన్న తన వ్యవసాయ మిరప పంట వద్ద కాపలాగా నిద్రిస్తున్నట్లు తెలిపారు.

అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని కొందరు దుండగులు గొడ్డలితో అతికిరాతకంగా మెడపై నరికి నరికి చంపారు. ఈ హత్య రాజకీయంగా జరిగిందా లేదా! భూవివాదాల  లేదా మరే కారణమైన జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. హత్యకు గురైన శ్రీధర్ రెడ్డి అవివాహితుడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.