గురు నానక్ విద్య సంస్థలో ఘనంగా జరిగిన "బృమోస్ ఫీస్టా - టెక్నో కల్చరల్ ఫెస్ట్ 2024"

గురు నానక్ విద్య సంస్థలో ఘనంగా జరిగిన "బృమోస్ ఫీస్టా - టెక్నో కల్చరల్ ఫెస్ట్ 2024"

ముద్ర,రంగారెడ్డి:రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురు నానక్ విద్యాసంస్థల యాజమాన్యం బృమోస్ ఫీస్టా టెక్నో కల్చరల్ ఫెస్ట్ 2024 అనే కార్యక్రమాన్ని విద్యార్థుల హర్షోత్సవాల మధ్య ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి విద్యాసంస్థల వైస్ చైర్మన్ సర్దార్ గగన్ దీప్ సింగ్ కోహ్లీ ముఖ్య అతిధిగా పాల్గొని ఈ టెక్నో కల్చరల్ ఫెస్ట్ యొక్క ఉద్దేశ్యం ఎప్పుడు చదువు మీదే ద్యాస కాకుండా ఉత్సాహంగా ఉల్లాసంగా  విద్యార్థులు తమ ప్రతిభ పాటవాలను ఒకరితో ఒకరు పంచుకొంటూ నూతన ఆవిష్కరణల మీద దృష్టి పెట్టి వాటిని సాధించే దిశగా అడుగులు వేసేందుకు తోడ్పడుతుందని చెపుతూ, అలాచేసినప్పుడే వారి వారి నైపుణ్యాలు బయటకు వస్తాయని అలా ముందుకు వచ్చి తమను తాము నిరూపించుకునే సందర్భం వస్తే అలాంటి ప్రతిభావంతులకు తమ సహకారం ఎప్పుడు ఉంటుందని ఆదిశగా ఉపాధ్యాయులు కూడా వారి అనుభవాన్ని ఉపయోగించి వారిని ప్రోత్సహించాలని అయన సూచించారు.

విద్యార్థులు కేవలం ఉద్యోగ సాధనే ద్యేయంగా పెట్టుకోకుండా నూతన ఆవిష్కరణలు చేసి వాటి ఫలాలను సమాజానికి అందించే దిశగా ప్రయత్నం చేస్తూ ఎంతో మందికి మార్గదర్శకంగా కూడా ఉండి ఎన్నో ఉద్యోగాలు కల్పించి మంచి పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని అయన సూచించారు. విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హెచ్ ఎస్ సైని ఫెస్ట్ ను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులను, సిబ్బందిని ఉత్సాహపరిచేందుకు ఆటవిడుపుగా ఉంటూ విద్యార్థుల మధ్య గురువు శిష్యుల సంబంధం బలంగా ఉండేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ  ప్రదర్శన కోసం ఫ్లాష్ మాబ్, గానం, వాయిద్య మరియు సోలో, టాలీవుడ్ మరియు బాలీవుడ్ క్విజ్, సోలో మరియు గ్రూప్ డ్యాన్స్‌లు, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్, రంగోలి, ఫోటోగ్రఫీ, మిస్టర్ & మిస్ జిఎన్‌ఐ, అంతాక్షరి మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అలాగే టెక్నికల్ రౌండ్స్ లో ఐడియా పిచింగ్, ఇ-స్పోర్ట్స్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ట్రెజర్ హంట్, సర్క్యూట్ బిల్డింగ్, బ్రిడ్జ్ బిల్డింగ్, డి-బగ్గింగ్, యుఐ డిజైన్ మొదలైన సాంకేతిక విభాగాలలో పాల్గొన్న విద్యార్థులలోని ప్రతిభను వెలికి తీసే దిశగా ప్రయత్నం చేశామని అయన చెప్పారు. ఈ కార్యక్రమంలో  డైరెక్టర్ డాక్టర్ కే వెంకట్ రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ శ్రీనాథ రెడ్డి, మరియు జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పి పార్థసారధి, అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ రిషి సాయల్, డీన్ R&D డా. ఎస్ వి. రంగనాయకులు, డాక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ,ఈవెంట్ చీఫ్ కో ఆర్డినేటర్ డా. హరీష్ కుంద్రా మరియు వివిధ విభాగిధిపతులు పాల్గొని విజయం సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేసారు.