ఏపీ మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో కొనసాగుతున్న  సీఐడీ సోదాలు

ఏపీ మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో కొనసాగుతున్న  సీఐడీ సోదాలు

ఏపీ మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబసభ్యుల ఇళ్లలో ఏపీ సీఐడీ సోదాలు జరుగుతున్నాయి. సీఐడీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కొండాపూర్ లోని మాజీ మంత్రి నారాయణ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. సొదాలపై నిన్న(శుక్రవారం) సీఐడీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. రాజధాని మాస్టర్ ప్లాన్ అవకతవకలపైనే సోదాలు చేస్తున్నారు. ఈ రోజు (శనివారం) సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. కూకట్ పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్ లో ఉన్న నారాయణ కుటుంబీకుల నివాసాలపై సీఐడీ సోదాలు నిర్వహించాయి. నారాయణ కుటుంబీకుల బ్యాంక్ స్టేట్ మెంట్లను సీఐడీ అధికారులు పరిశీలించారు. పలు లావాదేవీలపై అధికారులు ఆరా తీశారు. నిన్న (శుక్రవారం) నారాయణ రెండో కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌, మాదాపూర్, కొండాపూర్ శరణి నివాసంలో ఏక కాలంలో సీఐడీ అధికారుల తనిఖీలు చేశారు. మనీ రూటింగ్‌కు పాల్పడి అమరావతిలో భూముల కొనుగోలు చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. దాదాపు 146 ఎకరాలు కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. పక్కా ఆధారాలతో సోదాలు చేస్తున్నట్టుగా సీఐడీ వర్గాలు వెల్లడించాయి.