కార్మికులను కాపాడిన సాయి చరణ్ ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

కార్మికులను కాపాడిన సాయి చరణ్ ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
  • బాలుడి ధైర్య సాహసాలు పలువురికి ఆదర్శం కావాలి

ముద్ర/షాద్ నగర్:- ప్రమాదంలో ఉన్న కార్మికులను ధైర్యసహసాలతో సాహస బాలుడు సాయి చరణ్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అభినందించారు. ఆదివారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో సాయిచరణ్ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు తీసుకువెళ్లి సాహస బాలుడు సాయి చరణ్ ను పూలమాలలు శాలువాలతో ప్రత్యేకంగా సన్మానించారు. ఈనెల 26వ తేదీన రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో ఉన్న అల్విన్ ఫార్మసీ పరిశ్రమలో చోటు చేసుకున్న ప్రమాదంలో కార్మికులను తాడు సహాయంతో సాహస బాలుడు సాయి చరణ్ కాపాడటం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. బాలుడి ధైర్య సాహసాలు ఎంతో గొప్ప వాని, పలువురికి ఆదర్శంగా నిలువాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం రేవంత్ రెడ్డి బాలుడు కుటుంబ సభ్యులకు సూచించారు. చిన్న ప్రమాదం చోటు చేసుకుంటేనే ఎంతో దూరం పరుగులు తీసే నేటి సమాజంలో ఈ బాలుడు తన ప్రాణాలను పణంగా పెట్టి ధైర్యంగా కార్మికులను కాపాడటం అభినందనీయమని తెలిపారు. అదేవిధంగా బాలుడు భవిష్యత్తులో పలువురికి ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఎంపీటీసీ సభ్యులు కొమ్ము కృష్ణ, కుమారస్వామి గౌడ్ తో పాటు బాలుడు కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.