తెలంగాణ పౌరుషం.. గుజరాత్ ఆధిపత్యానికి పోటీ

తెలంగాణ పౌరుషం.. గుజరాత్ ఆధిపత్యానికి పోటీ
  • తెలంగాణలో కేసిఆర్ కు పట్టిన గతి మోదికి పడుతుంది
  • తెలంగాణ గడ్డమీదకి వచ్చి బెదిరిస్తే రజాకర్ల గతి బిజేపీకి పడుతుతుంది 
  • రిజర్వేషన్లు రద్దు చేసి ఇచ్చిన తెలంగాణను అవమాన పరచడమే కాంగ్రెస్ ముక్తు బారతా ?
  • కోరుట్ల జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రిజర్వేషన్లు ఇవ్వమన్నందుకు నాపై కేసు పెడతారా మోదిగారు..  కేసులకు నేను భయపడతానా... తెలంగాణ పౌరుషం గుజరాత్ ఆధిపత్యానికి జరుగుతున్న పోటీ ఇది ఇక్కడ భయపడితే భయపడే వాళ్ళు ఎవరు లేరు ఖబర్దార్ ప్రధానమంత్రి అని సియం రేవెంత్ రెడ్డి మోదిని హెచ్చరిచారు. కోరుట్ల జనజాతర సభలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లతో కలిసి పాల్గొన్న సియం రేవెంత్ రెడ్డి  మేడే సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడతూ కార్మికులందరూ కలిసి సకల జనుల సమ్మె చేపడితే.. కార్మికుల త్యాగాలతో  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మేడే సందర్భంగా  కార్మికులందరికీ సియం  మొదట శుభాకాంక్షలు తెలిపారు. మోది తెలంగాణ పర్యటనఫై సియం స్పందిస్తూ ఇది నా ఊరు నా ప్రాంతం నా ఊరికి వచ్చి నన్నే భయ పెడతావా.. ఆధిపత్యం చేయాలనుకుంటే ప్రధానిమోదికి  నిజాములకు పట్టిన గతి పడుతుంది  అన్నారు.

ఈ ఎన్నికలు ఆశమాసి ఎన్నికలు కాదు.. 17 సార్లు దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి, ఇప్పుడు జరిగే 18వ పార్లమెంట్  ఎన్నికలు గతంలో కంటే భిన్నంగా...  ఎంతో ప్రతేత్యేకమైన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.  బిజెపి 400 సీట్లు గెలవడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చేసి  దళితులు, గిరిజనలు, బలహీన వర్గాల రిజర్వేషన్లు ఎత్తేసి కార్పొరేట్ కంపెనీలు..అధాని.. అంబానీలకు దేశాన్ని అమ్మాలని కుట్ర జరగుతుందని అన్నారు. రాజ్యాంగం పై దాడి జరుగుతుంది ప్రజాస్వామ్యవాదులంతా ఆలోచన చేయాలి.. ఇది మన సమాజానికి పెను ప్రమాదమని హెచ్చరించారు.

70 సంవత్సరాలు వచ్చిన దళిత, గిరిజనులకు రావలసిన అవకాశాలు ఇంకా రాలేదని కాంగ్రెస్ పార్టీ సామాజిక స్పృహతో సామాజిక న్యాయం చేయాలని రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టి  కాంగ్రెస్ ను  అధికారంలో తీసుకు వచ్చాక బీసీ జనాభా లెక్కలు చేసి నిధులు నియామకాలు కల్పిస్తామని మాటిచ్చారు. అందుకే పదేళ్లు దళితులను,  బీసీలను పీడించి వందేళ్ళ విధ్వంసాన్ని సృష్టించిన కేసిఆర్ ప్రభుత్వాన్ని పక్కనపెట్టి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువచ్చారని అన్నారు. బలహీన వర్గాలను లెక్కించాలని క్యాబినెట్లో, శాసన సభలో తీర్మానం చేసి నిధులు కేటాయించాం. కాంగ్రెస్ పార్టీ దళితులు, గిరిజనులు, మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చి  వారి అభ్యున్నతికి కృసి చేయాలనీ నిధులు కేటాయిస్తే పెద్ద కుట్ర జరగుతుందని అన్నారు.

బిజేపీ 2/3 మెజార్టీ లభిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, అందుకే 400 సీట్లు గెలిచి  రిజర్వేషన్ రద్దు చేయాలని చూస్తుందని అన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీలను జాగృతం చేస్తున్నాడని ఢిల్లీలో అమిత్ షా నాపై కేసు పెట్టించారని అన్నారు. పదేళ్లు కెసిఆర్ చేసిన పని ఇప్పుడు కేంద్రంలో మోది చేస్తున్నాడని,  ఢిల్లీలో పోలీసులు ఈడి, సిబిఐ, ఇన్కంటాక్స్  ఉండవచ్చు... నా దగ్గర 50 లక్షల తెలంగాణ యువకులు ఉన్నారు.. మా వాళ్ల దెబ్బకు చంద్రశేఖర్రావు బోర్లబొక్కల పడ్డాడు... మీరుకూడా పడుతారని మోదిని హెచ్చరించారు.  తెలంగాణకు వచ్చిన నరేంద్ర మోడీ ప్రధానిగా కాకుండా గుజరాత్ వాడిగా వచ్చి దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నాడని.. బాండు ఇచ్చిన అరవిందుకు పసుపు బోర్డు ఇవ్వలేదు.. చెరుకు కర్మాగారం గురించి చెప్పలేదన్నారు.

మేము ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయడం,  మేము ఇచ్చిన తెలంగాణను అవమానించడమే కాంగ్రెస్ ముక్తు భారత అని సింయం ప్రశ్నించారు. దేశ ప్రధానిగా నరేద్ర మోది అబధం చెబుతున్నారని, మోది స్థాయికి దిగాజారి మాట్లాడుతున్నారని,   రాజ్యాంగం  మార్చాలని బిజేపీ కుట్ర చేసిందని, ధీనిఫై  2000 సంవత్సరంలోని రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చారని, అన్ని వివరాలు ఆధారాలతో సహా బయట పెడుతానని అన్నారు. పదేళ్లలో తెలంగాణకు మోడీ గాడిద గుడ్డు ఇచ్చిండని ఎద్దేవా చేశారు. 43 ఏళ్ల ప్రజా జీవితంలో జీవన్ రెడ్డి వల్ల పదవులకు వనే వచ్చింది... ఏనాడు కూడా అవినీతికి పాల్పడేందుకు పదవులను వాడుకోలేదని.. జీవన్ రెడ్డిని ఇండియా కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిని చేయాలని, అందుకు జగిత్యాల కోరుట్ల ప్రజలు రెండు లక్షల మెజారిటి ఇవ్వాలని.. బదులుగా కోట్ల నిధులు ఇచ్చే బాధ్యత నాది అని అన్నారు. రిజర్వేషన్లు ఉండాలంటే జీవన్ రెడ్డి గెలవాలన్నారు.


నిజామాబాదు ఎంపి అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా జీవితంలో రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల నియోజకవర్గం... జగిత్యాల ప్రాంతానికి సేవ చేయడం నా బాధ్యత అని నిజామబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి అన్నారు. కోరుట్లలో జరిగిన జన జాతర సభలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎంపిగా అరవింద్  విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి రైతాంగాన్ని అష్ట కష్టాలపాలు చేశాడని అన్నారు. తాను తెలంగాణలోనే అతిపెద్ద మామిడి మార్కెట్ జగిత్యాల్లో ఏర్పాటు చేశానని .. అందరూ అరవింద్ లాగా ఉంటారనుకోవద్ధని పనిచేసే వాళ్లు కూడా నాల ఉంటారని అన్నారు.  జగిత్యాలను  ఎడ్యుకేషన్ హబ్ గా మార్చానని  వైయస్సార్ హయాంలో పులివెందులకు దీటుగా జగిత్యాల అభివృద్ధి చేశానని ..పులివెందులలో లేని  కళాశాలలు  జగిత్యాలలో ఏర్పాటు చేసిన ఘనత జీవన్ రెడ్డిదని పేర్కొన్నారు. జగిత్యాలలో మామిడి పరిశోధన కేంద్రం, ప్రాసెసింగ్ యూనిట్,  హార్టికల్చర్ కళాశాల ఏర్పాటు చేయాలని, ... అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ వసతులు కల్పించాలని సియం రేవంత్ రెడ్డిని జీవన్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అది శ్రీనివాస్ , కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్శింగరావు తదితరులు పాల్గొన్నారు.