పోచారం తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆహ్వానం మేరకు బుధవారం రాత్రి పోచారం నివాసానికి విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి విచ్చేసి భేటీ అయ్యారు.
ముఖ్యమంత్రితో పాటు భేటీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ, దీపాదాస్ మున్షి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రికి, అతిధులకు పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కుటుంబ సభ్యులు ఆహ్వానం పలికారు.ఈసందర్భంగా ఆసియా చెస్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో రెండు గోల్డ్ మెడల్స్ సాదించిన పోచారం మనుమడు, భాస్కర్ రెడ్డి కుమారుడు పోచారం రుషాంక్ రెడ్డి ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ దీపాదాస్ మున్షి అభినందించారు.