పుట్టినరోజు సందర్బంగా యాదాద్రీశుడి సన్నిధిలో సీఎం రేవంత్‌రెడ్డి
ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ్మస్వామి వారిని శుక్రవారం రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ్మస్వామి కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు.రాష్ట్ర ముఖ్య మంత్రి తో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టూరిజం సినిమా టోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య, సీ ఎస్ శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, యమ్ పీ లు చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి, దేవాదాయశాఖ కమీషనర్ హనుమంత్ కె. జండగే జిల్లా కలెక్టర్ హనుమంతరావు , రాచకొండ సి పి సుధీర్ బాబు వేద పండితులు, అర్చకులు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
ముందుగా స్వామి వారి పుష్కరిణి వద్ద స్నాన సంకల్పన గావించారు. అఖండ జ్యోతి దీపారాధన సమర్పించారు. తూర్పు రాజగోపురం ద్వారా ముఖ్యమంత్రి, మంత్రులు ఆలయంలోనికి ప్రవేశించారు. ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు, వేద పండితులు ఆలయ సంప్రదాయంతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
ధ్వజ స్తంభం వద్ద మొక్కి తదుపరి స్వామి వారి అంతరాలయంలో అర్చన పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ముఖ్యమంత్రి కి మహా మండపంలో వేద మంత్రాలతో వేదాశ్వీరచనం గావించడం జరిగింది. రాష్ట్ర దేవాయదాయ శాఖప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ముఖ్య మంత్రి, మంత్రులను శాలువాతో సత్కరించారు. స్వామి వారి మెమొంటోను అందచేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి స్వామివారి ప్రసాదాన్ని అందచేశారు.