ఏపీలో ఎవరు వచ్చినా మాకేం బాధ లేదు!

ఏపీలో ఎవరు వచ్చినా మాకేం బాధ లేదు!

ముద్ర,తెలంగాణ:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సోమవారం పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ రాజకీయ భవిష్యత్తు బ్యాలెట్ బాక్సుల్లో ఉంది. జూన్ 4వ తేదీన ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. అదే రోజున దేశవ్యాప్తంగా ఫలితాలు రానున్న సంగతి తెలిసిందే.

అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీ రాజకీయ పరిస్థితులపై, ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఏపీలో ఎవరు వచ్చినా తనకేం బాధ లేదంటూ వ్యాఖ్యానించారు సీఎం రేవంత్. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన… చంద్రబాబు గెలిచిన… తనకేం లాభం ఉండదన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అయినా సత్సంబంధాలు కొనసాగిస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.