గీతదాటితే వేటే ... నోటి దురుసు తగ్గించుకోవాలి

గీతదాటితే వేటే ... నోటి దురుసు తగ్గించుకోవాలి
  • కాంగ్రెస్​ లో పూర్తి స్వేచ్ఛ ఉంది
  • నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు
  • ఎమ్మెల్సీ తీన్మార్​ కు సీఎం రేవంత్ వార్నింగ్​..?

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్నపై సీఎం రేవంత్​ రెడ్డి సీరియస్​ అయ్యారు. సొంత పార్టీ నేతలపై ఆయన చేస్తున్న వ్యతిరేక వ్యాఖ్యలు.. రెడ్డి సామాజిక వర్గ నేతలపై దూకుడును తగ్గించుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలకు సిద్​ధంగా ఉండాలని సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఈ నెల 2న జరిగిన బీసీ గర్జనలో ప్రసంగించిన ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న రెడ్డి సామాజికవర్గ నేతలను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే సీఎం రేవంత్​ రెడ్డే రాష్ట్రానికి చివరి రెడ్డి సీఎం అని చెప్పిన ఆయన మిర్యాలగూడ గర్జనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆస్తులు, ఆదాయంపై వివాదస్పద వ్యాఖ్​యలు చేశారు. దాంతో తీన్మార్​ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆ వర్గ నేతలు సీఎం, టీపీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ కు ఫోన్​ చేసి మల్లన్నపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఈ విషయాన్ని సీరియస్​ గా తీసుకున్న సీఎం.. మహేశ్ కుమార్​ గౌడ్​ కు ఫోన్​ చేసి విషయంపై ఆరా తీశారు.  తీన్మార్ మల్లన్న కాకుండా.. నోరు జారిన ఇతర నేతల గురించి సీఎం రేవంత్ ఆరా తీశారు. పార్టీ చీఫ్​ సైతం మల్లన్న తీరుపై తనదైన శైలీలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో నేరుగా మల్లన్నతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్నను మందలించినట్టు తెలిసింది. మరోవైపు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న, పాలన తీరుపై తమ అనుచరుల ముందు విమర్శిస్తున్న నేతలపైనా కన్నేసి ఉంచాలని సీఎం, టీపీసీసీ చీఫ్​ పలువురికి బాద్యతలు అప్పగించినట్లు సమాచారం.  వారిలో కొందరిపై చర్యలు తీసుకుంటేనే తప్పా మిగతా వారి దూకుడుకు కళ్లెం వేయలేమనే భావనతో టీపీసీసీ, ఏఐసీసీ నేతలు ఉన్నారు.