కాంగ్రెస్ లో చేరికకు సి ఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్

కాంగ్రెస్ లో చేరికకు సి ఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: బీ ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా నిన్న  రాజీనామా చేసిన నిర్మల్ ఎంపీపీ కొరిపల్లి రామేశ్వర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్ లు కాంగ్రెస్ లో చేరికకు మార్గం సుగమమైంది. ఈ మేరకు వారు కాంగ్రెస్ నేత ఆర్జుమంద్ అలీ సహా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. వారు కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో మార్గం సుగమమైంది. నిర్మల్ లో శనివారం సాయంత్రం జరిగే ఒక కార్యక్రమంలో ఇంఛార్జి మంత్రి ధనసరి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు