విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందించేందుకే సీఎం అల్పాహారం: జిల్లా కలెక్టర్ కర్ణన్

విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందించేందుకే సీఎం అల్పాహారం: జిల్లా కలెక్టర్ కర్ణన్

ముద్ర ప్రతినిధి, నల్లగొండ:ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పౌష్టిక ఆహారం అందించేందుకు సీఎం అల్పాహార పథకం అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అర్.వి కర్ణన్ అన్నారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ అర్.వి కర్ణన్ సందర్శించి ముఖ్యమంత్రి అల్పాహార పథకం అమలు పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంట్లో తిని వస్తున్నారా అని అడిగారు. పాఠశాలలోనే ప్రతి రోజు పౌష్టిక ఆహారం అందించనున్నట్లు, పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్ చేయ వచ్చని అన్నారు. ముఖ్యమంత్రి అల్పాహార పథకం ద్వారా పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించడంతో పాటు వారిలో చదువుపై శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు.  ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం  నాణ్యతతో బ్రేక్ ఫాస్ట్ అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ జ్యోతి లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ పూర్ణ చందర్ రావు, ఎంఈఓ బాలాజీ నాయక్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తదితరులున్నారు.