పేద వర్గాల ఆశాదీపంగా సిపిఐ పార్టీ పని చేస్తుంది 

పేద వర్గాల ఆశాదీపంగా సిపిఐ పార్టీ పని చేస్తుంది 
  • దేశ భక్తి పేరుతో యువతను తప్పుదారి పట్టిస్తున్న బిజెపి
  • పార్లమెంటు ఎన్నికలో బిజెపి కి గుణపాఠం చెప్పాలి
  • సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కేతూరి శ్రీరామ్

ముద్ర,పానుగల్:-రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఒక్క ఎంపీ సీటులో కూడా గెలవకుండా ప్రజలు గుణపాఠం చెప్పాలని సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీరామ్ పిలుపునిచ్చారు. సిపిఐ 99 వ వార్షికోత్సవ, వారోత్సవాలను పానగల్ మండలం వెంగళాయిపల్లిలో శనివారం ఘనంగా నిర్వహించారు. సిపిఐ మండల కార్యదర్శి డంగు కురుమయ్య బస్టాండ్ లో అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు.శ్రీరాం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. 1925 డిసెంబర్ 26న పుట్టిన సిపిఐ పేద వర్గాల ఆశాదీపంగా పోరాడుతోందన్నారు. 99 ఏళ్లుగా అధికారం రాకున్నా మనుగడ లో ఉన్నఘన చరిత్ర సిపిఐ సొంతమన్నారు. ప్రజల మధ్య ప్రజల కోసమే పోరాడటమే అందుకు కారణమన్నారు. ప్రజల కష్టాలు బిజెపికి పట్టవన్నారు.

హిందూ మతం మాయలో ముంచి ఓట్లు దండుకోటమే దాని లక్ష్యమన్నారు. అందుకే రామాలయ ప్రారంభోత్సవాన్ని పార్లమెంట్ఎన్నికల ముందు ముందుకు తెచ్చిందన్నారు. అప్రమత్తంగాఉండాలని కోరారు. దేశభక్తి పేరుతో యువతను తప్పుదారి పట్టిస్తుందని తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలన్నారు. సిపిఐ మద్దతు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ప్రజాపాలన సభల్లో ఐదు గ్యారెంటీలకు అందరూ దరఖాస్తు చేసుకోవాలని అమలుకు కృషి చేస్తామన్నారు. అవసరమైతే ప్రజల కోసం కాంగ్రెస్తోను సిపిఐ పోరాడుతుందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు అధికారమే పరమావధిగా పుడతాయని, కానీ సిపిఐ పేదల కోసమే పుట్టిందన్నారు. సిపిఐసభ్యత్వ నమోదు మొదలైందని పార్టీలో చేరాలన్నారు. ఈ కార్యక్రమంలో డంగు కురుమయ్య, వెంగళాయిపల్లి సిపిఐగ్రామ శాఖ కార్యదర్శి మల్లెపు బాలస్వామి, కేతేపల్లి పంచాయతీ వార్డు సభ్యుడు పెంటయ్య, నాయకులు మల్లెపు నరసింహ, ఎం .నరసమ్మ ,లక్ష్మి, రామకృష్ణ,బాలస్వామి కాకం నరసింహ, కుర్వ హన్మంతు, నాగయ్య ,కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.