సిఎస్టిఎం పెద్దపల్లి ప్రత్యేక రైళును పునరుద్దరించాలి

సిఎస్టిఎం పెద్దపల్లి ప్రత్యేక రైళును పునరుద్దరించాలి

కోరుట్ల, ముద్ర:-గురువారం నుంచి సిఎస్టిఎం కరీంనగర్ ప్రత్యేక రైలు సేవలు నిలిపివేయబడతాయని  మహారాష్ట్రలో దినపత్రికలలో వచ్చిన కథనానికి ముంబై బహుజనులు వెంటనే స్పందించారు. గురువారం ముంబై తెలంగాణ బహుజన ఫోరం (ఎటీబిఎఫ్) ఆధ్వర్యంలో కోరుట్ల ఆర్డిఓ ను ప్రత్యక్షంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డిఓ కోరుట్ల తగు చర్యలు చేపడ్తామని, ఇచ్చిన వినతి పత్రాన్ని ఉన్నత అధికారులకు, రైల్వే మినిస్టర్ ఆఫీస్ కు అందజేస్తామని హామీ ఇచ్చారు.

అయితే ఈ డిమాండ్ పత్రంలో కరీంనగర్ రైలును మరిన్ని రోజులు పొడిగించాలని, అజంతా ఎక్స్ ప్రెస్ రైలును మన్మాడ్ నుంచి ముంబై వరకు పొడిగించాలని, రాజ్యరాణి ఎక్స్ ప్రెస్, పన్వెల్ ఎక్సప్రెస్ రైలును నాందేడ్ నుంచి పెద్దపల్లి వరకు పొడగించాలన్న డిమాండ్లు పొందుపర్చారు. అలాగే వలసజీవుల వేసవి సెలవుల దృష్ట్యా నిజమాబాద్, కరీంనగర్, పెద్దపల్లి కి వెళ్లి, తిరిగి ప్రయాణంలో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పైగా ప్రైవేటు బస్సుల దోపిడి సామాన్యుడిపై బారం పడుతుందని పెర్కోన్నారు. ఈ బృందలో  ఎంటిబిఎఫ్ కో-ఆర్డినేటర్ బద్ది హేమంత్ కుమార్, కన్వీనర్లు బాలే అజయ్, ఎర్ర అశోక్ మహారాజ్, అరుష్ మహారాజ్ ఉన్నారు.