మున్సిపల్ కమిషనర్ పై కేసు నమోదు

మున్సిపల్ కమిషనర్ పై కేసు నమోదు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ పై పోలీస్ లు కేసు నమోదు చేశారు. భార్య జ్యోతిని వరకట్నం కోసం హత్య చేశాడని జ్యోతి తండ్రి గంగవరపు రాంబాబు, తల్లి రవీంద్ర కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలకృష్ణ పై పోలీస్ లు కేసు నమోదు చేశారు. బాలకృష్ణ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు అయ్యింది.

బాలకృష్ణ ను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి ఆందోళన చేశారు. బాలకృష్ణ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. జ్యోతి మృతదేహానికి బుధవారం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంసభ్యులకు అప్పగించగా జ్యోతి స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కొనిచర్ల మండలం సీతారామపురం గ్రామానికి తరలించారు.