కొడాలి నాని పై కేసు నమోదు ...

కొడాలి నాని పై కేసు నమోదు  ...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-  మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొడాలి నానితో పాటు మరికొందరిపై ఈకేసులు నమోదు చేశారు. తమను వేధించి బలవంతంగా రాజీనామాలు చేయించారని కొడాలి నానితో పాటు ఆయన ప్రధాన అనుచరుడు శశిభూషణ్ తో పాటు మరో ముగ్గురిపై రాజీనామా చేసిన వాలంటీర్లు ఫిర్యాదు చేశారు.