మద్యం తాగి వాహనాలు నడిపితే కేసు నమోదు: గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్

మద్యం తాగి వాహనాలు నడిపితే కేసు నమోదు: గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : మద్యం త్రాగి వాహనాలు నడిపే వారికి అవగాహనా కల్పిస్తున్న  గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ

గద్వాల:జిల్లా ఎస్పీ  కె. సృజన ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్ కార్యాలయంలో వివిధ మండలలా పరిధిలో మద్యం తాగి పట్టుబడిన 17 మంది వాహనదారులకు గద్వాల ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్, ఆధ్వర్యంలో మద్యం తాగి పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్.మాట్లాడుతూ. మద్యపానం సేవించి వాహనాలు నడపరాదని మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలను కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి వాహనదారులు మద్యపానం సేవించి వాహనాలు నడపరాదని మద్యపానం సేవించి వాహనాలు నడిపే వారి పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.మద్యం మత్తులో వాహనం నడపవడం ఏదైనా ప్రమాదం జరగరాని జరిగితే కుటుంబాలు రోడ్డున పడతాయని అయన అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయని మిమ్మల్ని నమ్ముకుని కుటుంబం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకొని వాహనాలను నడపాలని సూచించారు.

మూడు ఛాలాన్స్ అంత  కంటే ఎక్కువ గా పెండింగ్ చాలెన్స్ ఉంటే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని కావున పెండింగ్లో ఉన్న చానల్స్ ని వెంటనే క్లియర్ చేయాలని తెలిపారు. వాహనదారులు పెండింగ్లో ఉన్న చాలన్స్ ని వెంటనే మీ దగ్గరలో ఉన్న మీసేవ కేంద్రాల్లో క్లియర్ చేసుకోవాలని వాహనదారులకు  సూచించారు, అలాగే నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలకు వెంటనే నెంబర్ ప్లేట్లు వేయించుకోవాలని తెలిపారు.   లేనియెడల వాహనాలు దొంగతనాల గురి అయ్యే అవకాశం ఉందని అన్నారు.  వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు.డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపరాదు. వాహనాలు నడిపేవారు విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించలని తెలియజేసారు.

మద్యం సేవించి వాహనం నడపరాదు. వాహనదారులు రోడ్డుపై వాహనాలను పార్కు చేయరాదు. టూ వీలర్స్ పై ఇద్దరకు మించి ప్రయాణించరాదు. ఆటోలలో ఎక్కువ మంది పిల్లలను. కూలీలను ఎక్కించుకోరాదు. ఆటోలో సీట్ పర్మిట్ ఉన్నంతవరకే ప్యాసింజర్ ఎక్కించుకోవాలి. డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్ మాట్లాడరాదు.రాష్ డ్రైవింగ్ చేయరాదు. పరిమిత వేగంలో వాహనాలు నడపాలి. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీస్ వారికి సహకరించాలని  ట్రాఫిక్ ఎస్ఐతెలిపారు. ఇంకెప్పుడు మద్యం తాగి వాహనాలు నడపమని గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమం లో ట్రాఫిక్ సిబంది రామకృష్ణ, రమేష్ పాల్గొన్నారు.