తిరుమల గిరి బంద్ విజయ వంతం

తిరుమల గిరి బంద్ విజయ వంతం

ముద్ర, తిరుమలగిరి: దళిత బందులో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకు గత మూడు రోజుల క్రితం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టిన అఖిలపక్ష నాయకుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ అఖిలపక్షకమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహి0చిన తిరుమలగిరి బంద్ విజయ వంతం అయింది బంద్ సందర్భంగా ఉదయం 8 గంటల నుండి అఖిలపక్ష పార్టీలకు చెందిన కాంగ్రెస్ బిజెపి ఎమ్మార్పీఎస్ వైఎస్ఆర్ టి పి బహుజన సమాజ్ పార్టీ సిపియుఎస్ఐ తదితర కార్యకర్తలు పట్టణ బంధు నిర్వహించాలని స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. తిరుమలగిరిలో అఖిలపక్ష బంద్ సందర్భంగా వ్యాపారస్తులు తమ వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు పట్టణంలోని కిరాణం బట్టల షాపులు హోటల్లు తోపుడు బళ్లు తదితర వ్యాపార సంస్థలను మూసివేసి బంద్ కు సహకరించారు ఈ సందర్భంగా అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు బందునువిఫలం చేయాలని ఉద్దేశంతో బలవంతంగా కొన్ని షాపులను తెరిపించారు.

అయినా ఆ వ్యాపారులు మళ్లీ తమ దుకాణం మూసివేశారు దీంతో అధికార పార్టీ నాయకులు వేసిన ఎత్తుగడ ఫలించలేదు ఈ సందర్భంగా పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేసిన నాయకులను పోలీసులు నియోజకవర్గం లోని పలు స్టేషన్లకు తరలించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు యెల్సోజు నరేష్. ఎమ్మార్పీఎస్  ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కందుకూరు సోమన్న కందుకూరు శ్రీను బిజెపి జిల్లా నాయకులు దినదయాల్ బహుజన సమాజ్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మల్లెపాక కృష్ణ  కొండ సోమయ్య మూల వెంకన్న ఎంపీటీసీ జిమ్మిలాల్. భాస్కర్ నాయక్ తోపాటు పలువురిని అరెస్ట్ చేశారు తిరుమలగిరి పట్టణ బందుకు ఇద్దరు సిఐలు పదిమంది ఎస్సైలు 50 మంది కానిస్టేబుల్ తో బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాగారం సిఐ రాజేష్ నాయక్ తో పాటు తిరుమలగిరి శివకుమార్ తుంగతుర్తి ఎస్ ఐ డానియల్ తో పాటు పలువురు ఎస్సైలు బందోబస్తు పర్యవేక్షించారు.