పరీక్షా కేంద్రాలకు సెల్ఫోన్ల అనుమతి లేదు

పరీక్షా కేంద్రాలకు సెల్ఫోన్ల అనుమతి లేదు
  • పరీక్షలు సజావుగా జరిగేందుకు తీసుకున్న ఏర్పాట్ల పరిశీలన..
  • కె ఆర్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో జరుగుతున్న పరీక్ష ను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు..

ముద్ర ప్రతినిధి కోదాడ:-కే. రాఘవమ్మ, రంగారావు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఆకస్మికంగా పరిశీలించారు.

గురువారం కోదాడలోని కె ఆర్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో జరుగుతున్న ఇంటర్ పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. కేంద్రాల వద్ద పరీక్షలు సజావుగా జరిగేందుకు అధికారులు తీసుకున్న చర్యలు, పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, విద్యార్థుల హాజరు వివరాలు పరీక్ష కేంద్రం చీఫ్ సూపర్డెంట్ పి. జోష్న ను అడగగా ఈరోజు జరిగిన పరీక్షకు 212 మంది విద్యార్థులు హాజరయ్యారని 5 గురు విద్యార్థులు హాజరు కాలేదని జిల్లా కలెక్టర్ కు ఆమే తెలిపారు.


అనంతరం కలెక్టర్ పరీక్ష గదులను పరిశీలించి ,పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కేంద్రంలో కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా తగిన మౌలిక సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోదాడలో ఇంటర్మీడియట్ పరీక్షలలో భాగంగా గురువారం ఇంటర్ రెండవ సంవత్సరం కోదాడలో మొత్తం 1911  విద్యార్థులు గాను1837 హాజరయ్యారని,  74 మంది గైర్హా హజరరయ్యారని తెలిపారు.కలెక్టర్ వెంట తాసిల్దార్ సాయి గౌడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అధికారి రవికుమార్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.