తస్మాత్ జాగ్రత్త - కరీంనగర్ లో విజృంభిస్తున్న సెల్యూలైటిస్ వ్యాధి
కరీంనగర్ జిల్లాలో మరో వ్యాధి భయ బ్రాంతులకు గురి చేస్తోంది. ప్రధానంగా ఈ వ్యాధి బారిన పడ్డవారు దురదతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వ్యాధి పేరు సెల్యూలైటిస్. ఇది తొలుత దురదతో మొదలై గాయంగా మారుతుంది వ్యాధి. ఇక నెల రోజుల వ్యవధిలో వందల సంఖ్యలో బాధితులు ఉన్నారు. ఇక సెల్యూలైటిస్ వ్యాధి సాధారణ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనే. కానీ వ్యాధి తీవ్రతతో ప్రమాదకరంగా మారుతుంది.
ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లపై ప్రభావం చూపుతుంది. నిర్లక్ష్యం వహిస్తే శరీర భాగాలకు సోకే ప్రమాదం ఉంది. సెల్యూలైటిస్ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలో వస్తుంది. ఏటా పదుల సంఖ్యలో ఉండే ఈ వ్యాధి బాధితులు ఈ సారి మాత్రం వందల్లో ఉన్నారు.. ఈ వ్యాధి సోకిన వారు వెంటనే చికిత్స చేయించుకుంటే మేలంటున్నరు వైద్య నిపుణులు.