గ్రామాభివృద్ధికి కేంద్రం పెద్ద పీట: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

గ్రామాభివృద్ధికి కేంద్రం పెద్ద పీట: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి ఇతోధికంగా నిధులు మంజూరు చేస్తోందని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్  రెడ్డి అన్నారు. నిర్మల్ రూరల్ మండలం లంగ్డాపూర్ లో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని  ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి  బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఎన్ ఆర్ ఈ జి ఎస్ నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందని అన్నారు.

గ్రామాల్లో నిర్మిస్తున్న రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, గ్రామ పంచాయతీ భవనాలు, స్ట్రీట్ లైట్స్, ఇలా ప్రతీ కార్యక్రమం కేంద్ర నిధులతో నిర్వహిస్తున్నామని తెలిపారు. నిర్మల్ నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు, బీజేపి నాయకులు అంజు కుమార్ రెడ్డి, రావుల రాం నాథ్, తోకల అనిల్, జమాల్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.