కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగడం ఖాయం: డీసీసీ అధ్యక్షురాలు సురేఖ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగడం ఖాయం: డీసీసీ అధ్యక్షురాలు సురేఖ

డీసీసీ అధ్యక్షురాలు సురేఖ

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు ప్రజలు చరమగీతం పలికే రోజు దగ్గరపడిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. శుక్రవారం గడప, గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో సురేఖ పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ఖ్యాతిని తెలియజేశారు. కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని కేసీఆర్ ప్రజా పాలలను పక్కనపెట్టి అవినీటి ఊబిలో కూరుకుపోయారని ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిం చారని విమర్శించారు. రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల దేశంలో కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం వచ్చిందని అన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ జరిపిన పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణులలో ఉత్సాహం నింపిందన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక రాహుల్ కృషి ఉందని తెలిపారు. కర్ణాటక లో అధికారంలోకి రావడం వల్ల దక్షిణ భారత దేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకుందని అన్నారు. కర్ణాటక తరహాలోనే తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని ఆమె అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల అన్ని వర్గాల ప్రజలు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే బలమైన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారని ఆమె చెప్పారు  కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుందని ప్రత్యర్థులు చేస్తున్న వాదన వచ్చే ఎన్నికల ఫలితాలతో తేలిపోతుందని ఆమె తెలిపారు.