ఈనెల 28న చలో మట్టపల్లి

ఈనెల 28న చలో మట్టపల్లి
  • కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలని ఉత్తమ్ పిలుపు

హుజూర్ నగర్ ముద్ర ప్రతినిధి : నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం ఈనెల 28న పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి మట్టపల్లి లోని దేవాలయంసన్నిధిలో ఎన్నికల నిర్వహణ చేపట్టనున్నట్లు రాష్ట్ర బారినీటిపారుదల పౌరసరపాల శాఖ మంత్రి నల్లమాద  ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారంతెలిపారు ఈ సమావేశానికి మాజీ మంత్రులు జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు పార్లమెంట్ సభ్యులు శాసన మండల సభ్యులు శాసనసభ్యులు గత ఎన్నికల్లో పోటీ చేసిన శాసనసభ అభ్యర్థులు డిసిసిబి చైర్మన్లు డీసీఎంఎస్ చైర్మన్ నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రస్తుత మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు ఏఐసీసీ మెంబర్లు పీసీసీ మెంబర్లు డిసిసి అధ్యక్షులు కార్యనిర్వాక అధ్యక్షులు మెంబర్లు జిల్లా బ్లాక్ మండల టౌన్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ సంస్థల అధ్యక్షులు కార్యదర్శులు మహిళా యువజన విద్యార్థి మైనార్టీ విభాగాల బీసీ ఎస్సీ ఎస్టీ కార్మిక సేవాదళ్ కిసాన్ సెల్ అన్ని విభాగాల వారు హాజరు కాగలరని తెలిపారు ప్రస్తుత ప్రజా ప్రతినిధులు జెడ్పిటిసిలు ఎంపీపీలు పీఏసీఏ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు ఎంపీటీసీలు పిఎసిఎస్ డైరెక్టర్లు హాజరై పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ పిలుపునిచ్చారు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మట్టపల్లి మహా క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో దర్శనం మధ్యాహ్నం ఒంటిగంటకు దేవాలయం మూసి వేసే సమయానికి రెండు గంటల వరకు భోజన విరామం వైశ్య సత్రంలో రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు టిటిడి కళ్యాణ మండపంలో నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల సన్నాక సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి పైన తెలిపిన ప్రతి ఒక్కరూ హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకుఉత్తమ్ పిలుపునిచ్చారు